మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్య నివారణ అంశాలపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ’ తాత్కాలిక నివేదిక 2025 నవంబరు 6న భారత సర్వోన్నత న్యాయస్థానానికి నివేదన
प्रविष्टि तिथि:
03 DEC 2025 8:06PM by PIB Hyderabad
ఉన్నత విద్య సంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఆత్మహత్య నివారణ అంశాలపై ఏర్పాటైన జాతీయ కమిటీ (నేషనల్ టాస్క్ ఫోర్స్- ఎన్‌టీఎఫ్) తన తాత్కాలిక నివేదికను 2025 నవంబరు 6న భారత సర్వోన్నత న్యాయస్థానానికి అందించింది. ప్రస్తుతం దీనిపై న్యాయస్థానం స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.
ఎన్‌టీఎఫ్‌ను గత మార్చి నెలలో ఏర్పాటు చేశారు. ఇది కిందటి దేశ వ్యాప్తంగా ఉన్నత విద్య సంస్థల (హెచ్ఈఐస్) నుంచి వాటి అభిప్రాయాల్ని సేకరించడానికి ఒక కేంద్ర వేదికగా ఓ వెబ్‌సైటును ఆగస్టు 8 న ప్రారంభించారు. ఎన్‌టీఎఫ్ ఆన్‌లైన్ సర్వేలతో దేశమంతటా ఎంపిక చేసిన ఉన్నత విద్యాసంస్థలకు వెళ్లి, ఆసక్తిదారులతో సమావేశాలను నిర్వహించడంలో నిమగ్నమైంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న జాతీయ సమాచారాన్నీ, చట్టాల్నీ, విధానాల్నీ విశ్లేషించి, విద్యార్థుల మానసిక ఆరోగ్యంతో పాటు వారి సంక్షేమానికి సంబంధించిన రచనలను సమీకరిస్తోంది. ముఖ్య ఆసక్తిదారుల వద్ద నుంచి అనేక రకాల సమాచారాన్నీ, వివిధ అభిప్రాయాల్నీ కూడా సేకరిస్తోంది.
ఎన్‌టీఎఫ్ నిర్వర్తిస్తున్న విభిన్న బాధ్యతలు ఆ సంస్థ దృష్టికోణానికి అద్దం పడుతున్నాయి. విద్యార్థుల సంక్షేమార్థం అనేక ప్రమాణాలను పరిశీలించడం దీని లక్ష్యం. ఈ ప్రమాణాల్లో.. విద్య పరమైన ఒత్తిడి, కులం లేదా తెగ, ధర్మం, దివ్యాంగత్వం, లింగం, లైంగికత, ట్రాన్స్‌జెండర్.. కారణంగా భేద భావాన్ని ఎదుర్కోవలసి రావడంతో పాటు, ఆర్థికపరమైన కష్టాలతో ఒత్తిడికి లోనవడం వంటివి భాగంగా ఉన్నాయి.
ఎన్‌టీఎఫ్ చేసే సిఫారసులకు ఒక బలమైన సాక్ష్యాధారమంటూ ఉండటం కీలకంగా మారింది. ఈ సిఫారసుల్ని ఉన్నత విద్యా సంస్థల సర్వేలతో పాటు వ్యక్తులు, విద్యార్థులు, తల్లితండ్రులు, మానసిక ఆరోగ్య వృత్తినిపుణుల సర్వేల ఆధారంగా అందజేస్తారు. సంస్థ పరమైన సర్వేను నింపడం ఉన్నత విద్యాసంస్థలకు తప్పనిసరి. ఈ సర్వేలో..ఫేకల్టీ తాలూకు వైవిధ్యం, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, విద్యార్థుల మిశ్రమం, మానసిక ఆరోగ్య సేవల్లో భాగంగా ఉండే ఏర్పాట్లు ఎలాంటివి? వేర్వేరు కమిటీల వివరాలు.. వీటితో పాటు విద్యార్థులకు ఉపయోగపడే విభాగాలకు సంబంధించిన వివరాలే కాక, విద్యార్థి సహాయక వ్యవస్థలను పటిష్ఠపరచడంలోని సవాళ్లు, సలహాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అనేక సర్వేల ద్వారా సేకరిస్తున్నారు. ఉన్నత విద్య విభాగం ఆధికారిక లేఖలు రాసి ఉన్నత విద్య సంస్థలకు ఈ విధమైన విజ్ఞప్తిని చేసింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను ఎన్‌టీఎఫ్, నియంత్రణాధికార సంస్థల ద్వారా చేపట్టారు.
ప్రతిస్పందనలను ఎక్కువగా రాబట్టుకోవడానికి గాను ఎన్‌టీఎఫ్ ఆన్‌లైన్ సర్వేలను నింపే చివరి గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది. ఈ పొడిగింపు వ్యక్తిగత ఆసక్తిదారులందరికీ.. విద్యార్థులు, ఫేకల్టీ, తల్లితండ్రులు సహా మానసిక ఆరోగ్య సేవల వృత్తినిపుణులకు.. వర్తిస్తుంది. ఉన్నత విద్య సంస్థల్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సర్వేలను నింపడంలో స్వచ్ఛందంగా తోడ్పాటును అందించి ఎన్‌టీఎఫ్‌కు సాయపడాల్సిందిగా ఆయా సంస్థల్ని కోరారు. దీనిలో గోపనీయతకు పెద్దపీట వేస్తామనీ, పేర్లను వెల్లడి చేయబోమనీ హామీని ఇచ్చారు.
సర్వేలో పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి కలిసికట్టుగా ప్రయత్నించాల్సిందిగా రాష్ట్ర నోడల్ అధికారులు సహా ఆసక్తిదారులందరికీ నేషనల్ టాస్క్ ఫోర్స్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ భాగస్వామ్య ప్రక్రియ ద్వారా సేకరించిన విభిన్న ఆలోచనలూ, ప్రత్యక్ష అనుభవాలూ టాస్క్ ఫోర్స్ తుది సిఫారసులకు ఒక రూపును ఇవ్వడంలో ముఖ్య పాత్రను పోషించనున్నాయి.
మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికీ, పాలుపంచుకోవడానికీ దయచేసి ntf.education.gov.in ని చూడగలరు.
***
(रिलीज़ आईडी: 2199166)
आगंतुक पटल : 5