గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఈ నెల 3 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కేఎల్ విశ్వవిద్యాలయంలో 6వ జాతీయ ఈఎంఆర్ఎస్ సాంస్కృతిక, సాహిత్య ఉత్సవంతో పాటు కళా ఉత్సవం ‘ఉద్భవ్- 2025’ను నిర్వహిస్తున్న నెస్ట్స్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయల్ ఓరం
प्रविष्टि तिथि:
04 DEC 2025 8:44AM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ విద్య సంస్థల సొసైటీ (ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) ఆతిథ్యమిస్తున్న 6వ జాతీయ ఈఎంఆర్ఎస్ సాంస్కృతిక, సాహిత్య ఉత్సవంతో పాటు కళా ఉత్సవమైన ‘ఉద్భవ్- 2025’ను గిరిజన విద్యార్థుల జాతీయ సొసైటీ (ఎన్ఈఎస్‌టీఎస్.. ‘నెస్ట్స్) ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్ విశ్వవిద్యాలయంలో ఈ రోజు దీనిని గిరిజన సంక్షేమం, మహిళా, బాల సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్య రాణితో పాటు గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయల్ ఓరం ప్రారంభించారు.

గిరిజన యువతకు సాధికారత కల్పనతో పాటు దేశ గిరిజనుల చైతన్యవంత వైవిధ్యాన్ని ఓ వేడుకగా నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ఈ సంవత్సరం నిర్వహిస్తున్న ఉత్సవం చాటిచెబుతోంది. 35 కు పైగా సాంస్కృతిక, సాహిత్య, దృశ్యకళా కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేందుకు ఈ వేదిక అవకాశాన్ని అందిస్తోంది. దీంతో జాతీయ స్థాయిలో అనుభవంతో పాటు సమగ్ర పురోగతికి కూడా అవకాశాలు వారికి లభిస్తాయి.
గిరిజనుల సమ్మిళిత అభివృద్ధి, సాధికారతల విషయంలో గౌరవ ప్రధానమంత్రి దృష్టికోణానికి అనుగుణంగా.. సమన్వయపూర్వక, ప్రణాళికయుత, పరివర్తనాత్మక కార్యక్రమాలతో షెడ్యూల్డు తెగల సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి ఆశయంతో ఈ ఉత్సవం ముడిపడి ఉంది. గిరిజన విద్యార్థులకు తమ సృజనాత్మక ప్రతిభను కనబరిచే, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొనేందుకూ, సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసేందుకూ ఒక జాతీయ వేదికను అందిస్తూనే ఉద్భవ్-2025 గిరిజన వ్యవహారాల మంత్రికున్న అభివృద్ధి దృష్టికోణానికి తగ్గట్లు సంపూర్ణ సాధికారత కల్పన కృషికీ కీలక తోడ్పాటును అందిస్తోంది.
ఉద్భవ్-2025 ముఖ్యాంశాలు
1.భారత గిరిజన సాంస్కృతిక వైవిధ్యాన్ని ఉత్సవ స్థాయిలో నిర్వహించడం
భారత గిరిజనుల ఏకత, ప్రతిభ, సాంస్కృతిక చైతన్యాలను చాటేందుకు దేశం నలుమూలల నుంచి ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల (ఈఎంఆర్ఎస్)కు చెందిన 2,000కి పైగా గిరిజన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. వారు వివిధ సాంస్కృతిక, సాహిత్య సమర్పణలతో జాతీయ వేదికపై తమ వారసత్వ సంపన్నతను కళ్లకు కడతారు.
‘ఉద్భవ్-2025’లో గానం, వాద్య సంగీతం, నృత్యం, రంగస్థలం, దృశ్య కళలు, సాహిత్య పోటీలు సహా 48 విశిష్ట కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేదికలు విద్యార్థులకు తమ కళాత్మక కౌశలాన్నీ, సృజనాత్మక ప్రతిభనీ ప్రదర్శించేందుకు అవకాశాల్ని అందిస్తాయి. ఈ ఉత్సవంలో విజేతలు జాతీయ స్థాయి కళా ఉత్సవంలో పాల్గొనేందుకు కూడా అర్హులు అవుతారు. ఈ జాతీయ స్థాయి కళా ఉత్సవాన్ని మహారాష్ట్రలోని పుణేలో యశ్వంత్‌రావ్ చవాన్ అభివృద్ధి, పరిపాలన అకాడమి (యశదా)లో నిర్వహించనున్నారు. దానిలో ఈఎంఆర్ఎస్ విద్యార్థులు దేశవ్యాప్తంగా 38 జట్లతో పోటీ పడతారు.
పోటీపడాలన్న ఉత్సాహానికి తోడు, ఈఎంఆర్ఎస్ సాంస్కృతిక ఉత్సవం గిరిజన యువత సమగ్ర పురోగతిని ప్రోత్సహించడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇది సమానావకాశాల్ని అందిస్తూ, విద్యార్థులను వివిధ రంగాల్లో తమ సత్తాను తెలుసుకొనేటట్లు ప్రోత్సహించి, గిరిజనులతో పాటు ప్రధాన స్రవంతి ప్రజల నడుమ అంతరాన్ని భర్తీ చేయాలనే లక్ష్యంతో నిరంతరాయంగా కృషి చేస్తోంది. కొన్నేళ్లుగా ఈ ఉత్సవం మార్పును తీసుకువచ్చే వేదికగా రూపొందింది. సాంస్కృతిక, కళాత్మక, సాహిత్య రంగాల్లో శ్రేష్ఠత్వాన్ని ఈ ఉత్సవం పెంచి పోషిస్తోంది.
ఈ ఏడాది కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నెస్ట్స్ సాంస్కృతిక అభివ్యక్తీకరణ ద్వారా గిరిజన విద్య, సాధికారతల పట్ల తన నిబద్ధతను పునరునద్ఘాటిస్తోంది. గిరిజన విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి ‘ఉద్భవ్-2025’ ఊతాన్నిస్తూ, వారిలో సామాజిక ఆత్మవిశ్వాసాన్నీ, చదువుకోవాలన్న తపననీ పెంచడంతో పాటు వారు సృజనాత్మకంగా ఎదిగేందుకు కూడా తోడ్పడుతోంది.
***
(रिलीज़ आईडी: 2199163)
आगंतुक पटल : 2