సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ ప్రాధాన్యత గల 3,685 ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాల పరిరక్షణ, నిర్వహణను చేపట్టిన ఏఎస్ఐ


చారిత్రక వారసత్వ ప్రదేశాల సంరక్షణ, అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం ద్వారా అదనపు వనరులను సమీకరించాలనే లక్ష్యంతో జాతీయ సాంస్కృతిక నిధి (ఎన్‌సీఎఫ్) ఏర్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 04 DEC 2025 4:21PM by PIB Hyderabad

విదేశాల నుంచి 1976 మొదలు ఇప్పటివరకు మొత్తం 655 పురాతన వస్తువులను తిరిగి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా 3,685 జాతీయ ప్రాధాన్యత గల ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాల సంరక్షణ, నిర్వహణ పనులను భారత పురావస్తు సంస్థ (ఏఎస్ఐ) చేపడుతోంది. వీటిలో తాగునీరు, మరుగుదొడ్లు, మార్గాలు, ల్యాండ్ స్కేప్ వంటి సౌకర్యాలను కల్పిస్తారు. ఈ స్మారక చిహ్నాలు, స్థలాల నిర్వహణ నిరంతర ప్రక్రియ. అవసరం, వనరుల లభ్యత ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుంది.

జాతీయ స్మారక చిహ్నాలు, పురాతన వస్తువుల మిషన్‌ను 2007లో ఏర్పాటు చేయగా, అది 11,406 వారసత్వ కట్టడాలు ప్రదేశాలు, 12,46,211 పురాతన వస్తువులకు సంబంధించి డేటాను నమోదు చేసి, ప్రచురించింది. ప్రచురితమైన ఈ డేటా ఎన్ఎంఎంఏ వెబ్‌సైట్   www.nmma.nic.in లో అందుబాటులో ఉంది.
భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించటం, అభివృద్ధి చేయటం, భారత సాంస్కృతిక వారసత్వ ప్రచారానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అదనపు వనరుల సమీకరణే లక్ష్యంగా ఛారిటబుల్ ఎండోమెంట్ చట్టం-1890 ద్వారా జాతీయ సాంస్కృతిక నిధి (ఎన్‌సీఎఫ్)ని ట్రస్టుగా 1996లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఎన్‌సీఎఫ్‌కి విరాళాలు అందించే దాతలు, సంస్థలు.. ఏదైనా స్మారక చిహ్న పరిరక్షణ, సౌకర్యాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచించవచ్చు. పరిరక్షించిన స్మారక చిహ్నాల నిర్వహణను భారత పురావస్తు సంస్థ (ఏఎస్ఐ) చూస్తుంది. దాతృత్వ సంస్థలన్నీ ఎన్‌సీఎఫ్, ఏఎస్ఐ నిబంధనలకు లోబడి ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉండే పురాతన కట్టడాలకు పీపీపీ విధానంలో ఎన్‌సీఎఫ్ ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిని ఏఎస్ఐ, దాత, ఎన్‌సీఎఫ్ భాగస్వామ్య ప్రాజెక్టు అమలు కమిటీ పర్యవేక్షిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ రక్షిత స్మారక చిహ్నాల పరిరక్షణకు కార్పొరేట్ సంస్థలు, పీఎస్‌యూలు, లాభాపేక్ష లేని సంస్థల వంటి ప్రైవేటు సంస్థలను అనుమతించటానికి ఎలాంటి పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించలేదు.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2199147) సందర్శకుల సూచీ సంఖ్య : : 47
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali