కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెలికాం రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల ఫలితంగా, గత కొన్నేళ్లుగా దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల్లో గణనీయమైన వృద్ధి


గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ అనుసంధానత విస్తరణకు గాను డిజిటల్ భారత్ నిధి కింద పలు పథకాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

प्रविष्टि तिथि: 03 DEC 2025 4:46PM by PIB Hyderabad

దేశంలో టెలికాం రంగం బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలు ఆ రంగం వృద్ధికి గణనీయంగా దోహదపడ్డాయి. వీటిలో- సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) హేతుబద్ధీకరణ, బ్యాంక్ గ్యారెంటీల (బీజీ) హేతుబద్ధీకరణ, వడ్డీ రేట్ల క్రమబద్ధం, జరిమానాల తొలగింపు, వాయిదా చెల్లింపుల భద్రతకు అవసరమైన బ్యాంకు హామీల నిబంధనను (15.09.2021 తర్వాత జరిగే వేలాలకు) మినహాయించడం, భవిష్యత్  వేలంపాటల్లో స్పెక్ట్రమ్‌ను 10 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసేందుకు అనుమతివ్వడం, 15.09.2021 తర్వాత జరిగిన స్పెక్ట్రమ్ వేలంలో పొందిన స్పెక్ట్రమ్‌కు స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీ (ఎస్యూసీ) అవసరాన్ని మినహాయించడం. స్పెక్ట్రమ్ షేరింగ్ కోసం అదనపు 0.5%  ఎస్యూసీ తొలగింపు, భద్రతా పరమైన నిబంధనలకు లోబడి, టెలికాం రంగంలో ఆటోమేటిక్ రూట్ కింద 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి,  1953 కస్టమ్స్ నోటిఫికేషన్ కింద లైసెన్సులు పొందాలనే నిబంధన రద్దు మొదలైనవి ఉన్నాయి. 1953 కస్టమ్స్ నోటిఫికేషన్ ప్రకారం వైర్‌లెస్ పరికరాలకు అవసరమైన లైసెన్స్ విధానాన్ని స్వీయ ధృవీకరణతో భర్తీ చేయడం, పేపర్ కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపరచడం, రేడియో ఫ్రీక్వెన్సీ కేటాయింపు కోసం స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ (ఎస్ఏసీటీఏ) అనుమతులను సులభతరం చేయడం, స్పెక్ట్రమ్ వ్యవధిని 20 నుంచి  30 సంవత్సరాలకు పెంచడం వంటి చర్యలు కూడా ఇందులో ఉన్నాయి. 

వీటితో గత కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలలో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2018 మార్చి నాటికి ఉన్న 17.5 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్  నెట్‌వర్క్ 2025 సెప్టెంబర్ నాటికి 42.36 లక్షల కిలోమీటర్లకు విస్తరించింది. బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ల సంఖ్య కూడా 2018 మార్చిలో 17.3 లక్షల నుంచి 2025 అక్టోబర్ నాటికి 31.4 లక్షలకు పెరిగింది.  2025 అక్టోబరు నాటికి దేశంలో మొత్తం 6,44,131 గ్రామాలు ఉండగా, వాటిలో 6,34,019 గ్రామాలు మొబైల్ కనెక్టివిటీ పరిధిలోకి వచ్చాయి. వీటిలో 6,30,676 గ్రామాలకు 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి.2018 సెప్టెంబర్ నాటికి 48 కోట్లుగా ఉన్న బ్రాడ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్‌ల సంఖ్య 2025 జూన్ నాటికి ఏకంగా 98 కోట్లకు చేరుకుంది. 2025 అక్టోబరు 31 నాటికి దేశవ్యాప్తంగా 3.80 లక్షల పీఎం-వాణి వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేశారు. దేశంలో డేటా వినియోగం కూడా అనూహ్యంగా పెరిగింది. 2018 సెప్టెంబర్ నాటికి నెలకు సబ్‌స్క్రైబర్ ఒకరికి 8.32 జీబీగా ఉన్న డేటా వినియోగం, 2025 సెప్టెంబర్ నాటికి నెలకు 25.24 జీబీకి పెరిగింది.  అదే సమయంలో వైర్‌లెస్ డేటా చార్జీలు గణనీయంగా తగ్గాయి. సగటు వైర్‌లెస్ డేటా చార్జీ ప్రతి జీబీకి రూ.10.91 నుంచి రూ. 8.27కు తగ్గింది.

దేశవ్యాప్తంగా సమాన డిజిటల్ లభ్యత కోసం గ్రామీణ,  మారుమూల ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడానికి ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి కింద 4జీ సాచురేషన్ ప్రాజెక్టులు, సవరించిన భారత్‌నెట్ కార్యక్రమం వంటి పథకాలను అమలు చేస్తోంది; 

కేంద్ర కమ్యూనికేషన్ల, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు లోక్‌సభలో  ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ వివరాలు తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2198492) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी