ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 03 DEC 2025 9:11AM by PIB Hyderabad

డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో క్రీయాశీల భాగస్వామిగా ఉండటం నుంచి, రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షత వహించటం, మన దేశానికి మొదటి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించే వరకు అపారమైన గౌరవం, అంకితభావం, స్పష్టమైన లక్ష్యంతో ఆయన సేవలందించారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. "నిరాడంబరత, ధైర్యం, జాతీయ సమైక్యత పట్ల భక్తిభావంతో ప్రజా జీవితంలో ఆయన సుదీర్ఘంగా కొనసాగారు. ఆయన అందించిన ఆదర్శప్రాయమైన సేవలు, దార్శనికత తరతరాలకు స్ఫూర్తినిస్తాయి" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. భారత స్వాతంత్ర్య పోరాటంలో క్రీయాశీల భాగస్వామిగా ఉండటం నుంచి, రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షత వహించటం, మన దేశానికి మొదటి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించే వరకు అపారమైన గౌరవం, అంకితభావం, స్పష్టమైన లక్ష్యంతో ఆయన సేవలందించారు. నిరాడంబరత, ధైర్యం, జాతీయ సమైక్యత పట్ల భక్తిభావంతో ప్రజా జీవితంలో సుదీర్ఘంగా కొనసాగారు. ఆయన సేవలు, దార్శనికత తరతరాలకు స్ఫూర్తినిస్తాయి" 

 

***


(रिलीज़ आईडी: 2198108) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam