వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కృత్రిమ మేధ ఆధారిత రుతుపవనాల అంచనా పథకం
प्रविष्टि तिथि:
02 DEC 2025 5:38PM by PIB Hyderabad
ఖరీఫ్- 2025 కోసం వ్యవసాయ సంబంధిత స్థానిక రుతుపవనాల ఆరంభ అంచనాలపై దేశంలోని 13 రాష్ట్రాల్లో డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్-ఇండియా సహకారంతో కృత్రిమ మేధ ఆధారిత పైలట్ ప్రాజెక్టును నిర్వహించారు. గూగుల్ న్యూరల్ జీసీఎం, యూరోపియన్ మధ్య స్థాయి వాతావరణ అంచనా కేంద్ర (ఈసీఎండబ్ల్యూఎఫ్) కృత్రిమ మేధ అంచనా వ్యవస్థ (ఏఐఎఫ్ఎస్), భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నుంచి సేకరించిన 125 ఏళ్ల చారిత్రక వర్షపాత సమాచారం సహా ఓపెన్ సోర్స్ బ్లెండెడ్ మోడల్‌ను ఉపయోగించారు.
ఈ సంభావ్యతా అంచనాలు స్థానికంగా రుతుపవనాల ఆరంభాన్ని మాత్రమే అంచనా వేశాయి. పంటలు నాటే తేదీపై నిర్ణయం తీసుకోవడానికి ఇది చాలా కీలకం. స్థానిక రుతుపవనాల ప్రారంభ సూచనలను ఎం-కిసాన్ పోర్టల్ ద్వారా 13 రాష్ట్రాల్లోని 3,88,45,214 మంది రైతులకు అయిదు ప్రాంతీయ భాషలైన హిందీ, ఒడియా, మరాఠీ, బంగ్లా, పంజాబీల్లో ఎస్ఎంఎస్ ద్వారా పంపారు. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం కోసం ఎలాంటి ఆర్థిక సాయాన్నీ అందించలేదు.
సూచనలు పంపిన తర్వాత కిసాన్ కాల్ సెంటర్ల ద్వారా మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో టెలిఫోన్ ద్వారా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ సర్వేలను నిర్వహించారు. ప్రధానంగా భూమిని సిద్ధపరచుకోవడం, విత్తే సమయంలో మార్పులు చేయడం ద్వారా.. 31- 52% మంది రైతులు పంట నాట్లపై తమ నిర్ణయాలను సర్దుబాటు చేసుకున్నారని సర్వే వెల్లడించింది. పంట, ఉత్పాదకాల ఎంపిక కూడా ఇందులో ఉన్నాయి.
వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రాంనాథ్ ఠాకూర్ ఈ రోజు లోకసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2198107)
आगंतुक पटल : 8