ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌లో వైద్య విద్యపై తాజా సమాచారం


· అందుబాటులో ఉన్న అల్లోపతి, ఆయుష్ వైద్యులను బట్టి భారత్‌లో వైద్యుడు- జనాభా నిష్పత్తి 1:811గా ఉంటుందని అంచనా

· 2014లో 387 నుంచి నేడు 818కి పెరిగిన వైద్య కళాశాలలు

· అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య సీట్లలో గణనీయమైన పెరుగుదల... 2014లో 51,348 నుంచి నేడు 1,28,875కి పెరిగిన సీట్ల సంఖ్య

· దశాబ్ద కాలంలో విశేషంగా పెరిగిన పీజీ మెడికల్ సీట్లు... పదేళ్ల కిందట 31,185 నుంచి నేడు 82,059కి చేరిన సీట్ల సంఖ్య

· ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సమాచారం మేరకు 42.94 లక్షల మంది రిజిస్టర్డ్ నర్సింగ్ సిబ్బంది...

· ఏటా 3.87 లక్షల మంది నర్సులను అందిస్తున్న 5,253 నర్సింగ్ సంస్థలు

प्रविष्टि तिथि: 02 DEC 2025 4:38PM by PIB Hyderabad

ప్రతి 1000 మంది జనాభాకు ఒక పడక ఏర్పాటు, 20,000 నుంచి 30,000 మంది జనాభాకు ఇండోర్/అబ్జర్వేషన్ పడకలతో ఒక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఏఏఎం-పీహెచ్‌సీ), 80,000 -1,20,000 జనాభాకు 30 పడకలతో కూడిన సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), 1,00,000 - 5,00,000 జనాభాకు 31 -100 పడకలతో సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటళ్లు, అలాగే ప్రతి 30,00,000 వరకు జనాభా ఉన్న చోట్ల 101-500 పడకలతో జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని... భారత ప్రజారోగ్య ప్రమాణాలు (ఐపీహెచ్ఎస్- 2022) సిఫార్సు చేశాయి.

ప్రస్తుతానికి 13,86,150 మంది రిజిస్టర్డ్ అల్లోపతి వైద్యులున్నారు. ఆయుష్ వైద్య విధానంలో 7,51,768 మంది రిజిస్టర్ చేసుకున్న వైద్యులున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్లోపతిఆయుష్ వ్యవస్థలు రెండింటిలోనూ నమోదై ఉన్న వైద్యుల్లో 80 శాతం మంది అందుబాటులో ఉన్నారనుకుంటే.. దేశంలో వైద్యులు-జనాభా నిష్పత్తిని 1:811గా అంచనా. వైద్యుడు - జనాభా నిష్పత్తిని 1:1000గా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేయడం గమనార్హం.

దేశంలో వైద్య కళాశాలలు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు విశేషంగా పెరిగాయి. 2014 నుంచి నేటి వరకు.. వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 818కి, అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య 51,348 నుంచి 1,28,875కు, పీజీ సీట్ల సంఖ్య 31,185 నుంచి 82,059కు పెరిగాయి.

ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) అందించిన సమాచారం ప్రకారం.. 2025 మార్చి 31 నాటికి దేశంలో 42.94 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది నమోదు చేసుకున్నారు. మొత్తం 5253 నర్సింగ్ సంస్థలుండగా.. వాటిలో 809 ప్రభుత్వ4444 ప్రైవేటు సంస్థలు. దేశంలో నర్సింగ్ సిబ్బంది అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఏటా దాదాపు 3.87 లక్షల మంది నర్సింగ్ సిబ్బందిని ఈ సంస్థలు అందిస్తున్నాయి.

హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా (హెచ్‌డీఐ) (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్) 2022-23 అనేది ఓ వార్షిక ప్రచురణ. గతంలో దీన్ని రూరల్ హెల్త్ హెల్త్ స్టాటిస్టిక్స్ (ఆర్‌హెచ్ఎస్)గా పిలిచేవారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించిన ఆరోగ్య రక్షణ సేవల నిర్వహణ డేటా దీనికి ఆధారం. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయలు- అక్కడ అందుబాటులో ఉన్న పడకల వివరాలు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వివరాలను కింది లింకుల ద్వారా చూడొచ్చు:

 

Sl. No.

RHS/HDI

Link

1.

RHS 2019-20

https://mohfw.gov.in/sites/default/files/RHS%202019-20_2.pdf

2.

RHS 2020-21 

 

https://mohfw.gov.in/sites/default/files/rhs20-21_2.pdf

3.

RHS 2021-22

https://mohfw.gov.in/sites/default/files/RHS%202021-22_2.pdf

4.

HDI 2022-23

https://mohfw.gov.in/sites/default/files/Health%20Dynamics%20of%20India%20%

 

ఈ రోజు రాజ్యసభలో అందించిన ఓ లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాదవ్ ఈ వివరాలను తెలిపారు.


(रिलीज़ आईडी: 2197943) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil