రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఫుట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 01 DEC 2025 1:55PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని పాదరక్షల తయారీఅభివృద్ధి సంస్థ (ఎఫ్ డీడీఐస్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు (డిసెంబర్ 1, 2025) హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. నేడు భారత్ మరింత స్వయంపరిపూర్ణ దేశంగా మారుతూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 

తన పాత్రను విస్తరించేందుకు కృషి చేస్తోందని అన్నారుపాదరక్షల రంగానికి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ‘‘చాంపియన్ సెక్టార్’’ హోదా ఇచ్చినందుకు వాణిజ్యపరిశ్రమ మంత్రిత్వ శాఖలోని పరిశ్రమఅంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగంపై 

ప్రశంసలు కురిపించారుపాదరక్షల రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనుకూల వ్యవస్థనుప్రోత్సాహకాలను అందిస్తోందని తెలిపారు.

పాదరక్షల ఉత్పత్తివినియోగంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ పాదరక్షల ఎగుమతులు 2,500 మిలియన్ డాలర్లకు పైగా ఉండగా.. దిగుమతులు సుమారు 680 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని చెప్పారుదేశంలో పాదరక్షల ఎగుమతులు.. దిగుమతుల కంటే దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారుదీంతో ప్రపంచంలోనే పాదరక్షల కీలక ఎగుమతిదారునిగా భారత్ మారిందని తెలిపారుఅయినప్పటికీ మన ఎగుమతులను మరింత పెంచేందుకు.. పాదరక్షల వ్యాపారాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారుఈ విస్తరణ వలన విద్యార్థులు వ్యాపారవేత్తలుగా మారేందుకుఉపాధిని సృష్టించేందుకుసంస్థల్లో ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు దోహదపడుతుందన్నారు.

ఎఫ్ డీడీఐనార్తాంప్టన్ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం కుదరడంపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారుఇది భారత్బ్రిటన్ మధ్య ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పరిధిలో దేశ సహకారం మరింత పెరుగుతుందనే దానికి సూచికగా అభివర్ణించారుఈ 

ఒప్పందం మానవ మనుగడకు ఉపకరించే పదార్ధాలుపునరావృత ఆర్థిక విధానాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.. ఇలాంటి ప్రయత్నాలు పర్యావరణ పరిరక్షణపై రెండు దేశాల నిబద్ధతను ప్రతిబింబిస్తాయని ఆమె అన్నారు.

పాదరక్షల తయారీ రంగంలో అనేక ముఖ్యమైన కోణాలు ఉన్నాయని రాష్ట్రపతి తెలిపారుపట్టభద్రులవుతున్న విద్యార్థులు తమ పని ద్వారా సమాజందేశానికి బహుముఖంగా సేవ అందించాలనే విశాల దృష్టితో తమ రంగంలో ముందుకు సాగాలని ఆమె వారికి సూచించారుప్రజల ఆరోగ్యంరోజువారీ వినియోగ సౌలభ్యాన్ని మెరుగుపరిచే విధంగా పాదరక్షలను తయారీ చేయాలని కోరారుతమ పని ద్వారా మరెందరికో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారుఅభివృద్ధిలో వెనుకబడి ఉన్నవారిని ఆర్థిక వృద్ధిలో భాగస్వాములను చేయాలని సూచించారుదేశ ఎగుమతులను పెంచడంలో సహకారం అందిస్తూ మన ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారువారి నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా ప్రపంచ మార్కెట్‌లో దేశ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని, ‘స్వావలంబన భారత్’ జాతీయ లక్ష్య సాధనలో గణనీయమైన సహకారాన్ని అందించాలని కోరారు.

రాష్ట్రపతి ప్రసంగం చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

****


(रिलीज़ आईडी: 2196929) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Malayalam