రక్షణ మంత్రిత్వ శాఖ
కొలంబోలో జరిగిన శ్రీలంక నేవీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ- 2025లో పాల్గొన్న ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి
प्रविष्टि तिथि:
28 NOV 2025 1:25PM by PIB Hyderabad
శ్రీలంక నౌకాదళం నవంబర్ 27 నుంచి 29, 2025 వరకు కొలంబోలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)-2025లో భారత తొలి స్వదేశీ ఎయిర్‌క్రాప్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్, స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ ఉదయగిరి ఇండియా తరపున పాల్గొన్నాయి. శ్రీలంక నౌకాదళ 75వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు దేశాల నౌకలు, ప్రముఖులు, నిపుణులు పాల్గొన్నారు.
కార్యకలాపాల కోసం ఈ నౌకలు మొదటిసారి విదేశాలకు వెళ్లటం, ప్రాంతీయ సముద్ర సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన, దేశానికే గర్వకారణమైన ఐఎన్ఎస్ విక్రాంత్ మొదటిసారి అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనటం ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో (ఐఓఆర్) భాగస్వామ్య నౌకాదళాలకు భారత్ సహకారం స్పష్టమవుతోంది. సహకారం, పరస్పర కార్యాచరణ ద్వారా శాంతి, స్థిరత్వం, భద్రతను పెంపొందించటానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
ఇటీవల భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ ఉదయగిరి ఈ కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా, స్వదేశీయంగా అభివృద్ధి చెందుతున్న భారత నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సమానంగా, విస్తరిస్తున్న నౌకాదళ ఉనికిని స్పష్టం చేస్తుంది.
కొలంబోలో ముఖ్యమైన ఐఎఫ్ఆర్ కార్యక్రమాల్లో ఈ నౌకలు పాల్గొంటాయి. వీటిలో లాంఛనప్రాయ నౌకాదళ సమీక్ష, నగర పరేడ్, విస్తృత సామాజిక కార్యక్రమాలు, వృతిపరమైన నౌకాదళ చర్చలున్నాయి. విస్తృత ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఐఎఫ్ఆర్-2025 సందర్భంగా ఈ నౌకలను చూసేందుకు సందర్శకులకు అనుమతిస్తారు.
(15)QQI8.jpeg)
(14)MMOE.jpeg)
CUWV.jpeg)
***
(रिलीज़ आईडी: 2196715)
आगंतुक पटल : 4