సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎంఎంఎల్ ద్వారా అరుదైన చారిత్రక పత్రాల సేకరణను పరిశోధకులు ఆన్‌లైన్‌లో వీక్షించే అవకాశం

प्रविष्टि तिथि: 29 NOV 2025 1:35PM by PIB Hyderabad

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలోని ప్రధానమంత్రుల వారసత్వాన్ని పరిరక్షించటానికిప్రదర్శించటానికి అంకితమైన ప్రముఖ జాతీయ సంస్థ ప్రధానమంత్రి మ్యూజియంలైబ్రరీ (పీఎంఎంఎల్). ఇది అపారమైన చారిత్రక రికార్డులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావటంలో కీలక ముందడుగు వేసింది. 1,300 మందికి పైగా వ్యక్తులుసంస్థలకు చెందిన 25 మిలియన్ల కంటే ఎక్కువ డాక్యుమెంట్లుఅరుదైన సమాచారంతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సేకరణలు పీఎంఎంఎల్‌లో ఉన్నాయిఆధునికసమకాలీన భారతీయ చరిత్రను అధ్యయనం చేసే పరిశోధకులుఅధ్యయన వేత్తలు వీటిని ఉపయోగిస్తారు.

పీఎంఎంఎల్ చేపడుతున్న కీలకమైన కార్యక్రమం సమగ్ర డిజిటలైజేషన్ ప్రాజెక్టు ద్వారా అరుదైన పత్రాల సేకరణలో వ‌్యక్తిగత పత్రాలుఉత్తర ప్రత్యుత్తరాలుప్రసంగాలుడైరీలువార్తాపత్రికల కథనాలున్నాయిఈ పరివర్తనాత్మక ప్రయత్నం ద్వారా కీలకమైన పత్రాలను దీర్ఘకాలికంగా సంరక్షించటంతో పాటు పరిశోధకులు పరిమిత దూరం నుంచి డాక్యుమెంట్లను వినియోగించుకోవచ్చుతరచుగా వినియోగించే వివరాలను చాలావరకు ఇప్పటికే డిజిటలైజ్ చేసిఅప్‌లోడ్ చేయటమే కాకకొత్తగా అభివృద్ధి చేసిన వ్యవస్థ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు.

దూర ప్రాంతాల వారికి ఈ పత్రాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఐటీ వేదికను రూపొందించారునిర్దిష్ట డాక్యుమెంట్లను చూసేందుకు నమోదు చేసుకున్న అధ్యయనవేత్తలు పీఎంఎంఎల్‌ను సందర్శించకుండానే ఆన్‌లైన్‌లో అభ్యర్థించవచ్చుదానికి ఆమోదం లభించిన తర్వాత అభ్యర్థించిన డాక్యుమెంట్లను కేవలం వీక్షించేందుకు మాత్రమే అందుబాటులో ఉంచుతారు.

సాంకేతికతను ఉపయోగించి పీఎంఎంఎల్‌ డిజిటల్ ఆర్కైవ్స్ ప్రారంభం ద్వారాఅమూల్యమైన చారిత్రక వనరులను పరిరక్షించటానికిప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులుఅధ్యయనవేత్తలు, విద్యాభిలాషులకు  వాటిని సులభంగా అందుబాటులోకి తీసుకురావటానికి కీలక ముందడుగు పడింది.

పీఎంఎంఎల్ డైరెక్టర్ శ్రీ అశ్విని లోహాని మాట్లాడుతూఅత్యుత్తమ పరిశోధనను ప్రోత్సహించటానికిప్రాచీన వివరాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావటం ద్వారా భారతదేశ ఆధునికసమకాలీన అధ్యయనాన్ని బలోపేతం చేసేందుకు సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2196695) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil