కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశ కార్మిక నియమావళిని స్వాగతించిన అంతర్జాతీయ సంస్థలు.. సామాజిక భద్రత, సమ్మిళిత అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత


సామాజిక భద్రత, కనీస వేతనాలపై చట్టాల దృష్టి: ఐఎల్ఓ డైరెక్టర్-జనరల్

ప్రపంచ సామాజిక భద్రతా ప్రయత్నాలకు భారతదేశ కార్మిక నియమావళులు ప్రోత్సాహమంటూ స్వాగతించిన ఐఎస్ఎస్ఏ

प्रविष्टि तिथि: 22 NOV 2025 5:20PM by PIB Hyderabad

నాలుగు కార్మిక కోడ్ లను అమల్లోకి తీసుకువచ్చేందుకు నవంబర్ 21, 2025న భారత ప్రభుత్వం చేసిన ప్రకటను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ), అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం (ఐఎస్ఎస్ఏవంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు స్వాగతించాయిసామాజిక భద్రతను బలోపేతం చేయటంకనీస వేతన వ్యవస్థలను మెరుగుపరచటంసంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించటం దిశగా ఈ సంస్కరణలను కీలకమైనవిగా గుర్తిస్తూ.. సమగ్రఆధునిక కార్మిక వ్యవస్థలపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు భారత్ చేస్తున్న కృషి దోహదపడుతుందని అంతర్జాతీయ సంస్థలు తెలిపాయిప్రపంచ కార్మికసామాజిక భద్రతా ప్రమాణాలను రూపొందించటంలో పెరుగుతున్న భారత నాయకత్వాన్ని అంతర్జాతీయ సంస్థల వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.

భారత కార్మిక సంస్కరణలను ప్రశంసించిన ఐఎల్ఓ డైరెక్టర్-జనరల్

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓడైరెక్టర్ జనరల్ తన పోస్టులో ఈ విధంగా పేర్కొన్నారు: "ఇవాళ భారత్ ప్రకటించిన కొత్త కార్మిక కోడ్ ల పరిణామాలను.. ముఖ్యంగా సామాజిక భద్రతకనీస వేతనాలకు సంబంధించిన వాటిని నిశితంగా గమనిస్తున్నానుసంస్కరణలు కార్మికులువ్యాపారులకు సానుకూలంగా ఉండేలా చూసేందుకు వాటిని అమలు చేసేటప్పుడు ప్రభుత్వంయజమానులుకార్మికుల మధ్య సంప్రదింపులు అవసరం"

భారత కార్మిక చట్టాలను స్వాగతించిన ఐఎస్ఎస్ఏ

సామాజిక మాధ్యమం 'ఎక్స్లో ఇలా పేర్కొంది: "పటిష్టమైనసమగ్రమైన సామాజిక భద్రతా వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రయత్నాలకు భారత కార్మిక కోడ్ లు మరింత ఉత్తేజం కలిగిస్తున్నాయిఈ కీలక అంశాన్ని ఐఎస్ఎస్ఏ స్వాగతిస్తోందిపరిధిభద్రతసంస్థాగత సామర్థ్యం కోసం నిరంతర పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది".

 

భారతదేశ కార్మిక కోడ్ లపై ప్రధాన ప్రపంచ సంస్థలు వెలువరించిన ప్రకటనలుసానుకూల అంతర్జాతీయ స్పందనను ప్రతిబింబిస్తున్నాయిన్యాయమైన వేతనాలను అందించటంసామాజిక భద్రతా పరిధిని పెంచటంశ్రామిక శక్తిని వ్యవస్థాగతం చేయటం వంటి అంశాల్లో ఈ కోడ్ లు పురోగతిని కనబరుస్తున్నాయిభారత కార్మిక వ్యవస్థను మరింత బలోపేతం చేయటానికిసంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసేందుకుఅంతర్జాతీయ సంస్థలుదేశీయ వాటాదారులతో నిరంతర సహకారాన్ని కొనసాగించేందుకు కార్మికఉపాధి మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతనిస్తున్నట్లు స్పష్టం చేసింది.


***


(रिलीज़ आईडी: 2193236) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Odia , Kannada