కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ట్రాయ్ ఆదేశాల ప్రకారం బీఎఫ్ఎస్ఐ రంగ సంస్థలైన ఆర్‌బీఐ, సెబీ, పీఎఫ్ఆర్‌డీఏ నియంత్రిత సంస్థల్లో దశలవారీగా 1600 సిరీస్ అమలు తప్పనిసరి

Posted On: 19 NOV 2025 2:48PM by PIB Hyderabad

భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్ఇవాళ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏనియంత్రిత సంస్థల కమ్యూనికేషన్ల కోసం ‘1600' నంబరింగ్ సిరీస్‌ను తప్పనిసరిగా అమలు చేసేందుకు తుది గడువును నిర్దేశించిందివినియోగదారుడి నమ్మకాన్ని పెంపొందించిస్పామ్‌ను నియంత్రించివాయిస్ కాల్స్ ద్వారా మోసపూరిత చర్యలను నిరోధించాలన్న లక్ష్యంతో ఈ ఆదేశాలు జారీ చేసింది.

ట్రాయ్ చొరవకు ప్రతిస్పందనగా బ్యాంకింగ్ఆర్థిక సేవలుబీమా (బీఎఫ్ఎస్ ఐరంగంప్రభుత్వ సంస్థలకు కేటాయించటానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) 1600 నంబరింగ్ సిరీస్‌ను నిర్దేశించిందిఈ సంస్థల ద్వారా వచ్చే సేవలులావాదేవీలకు సంబంధించిన కాల్స్‌ని ఇతర వాణిజ్య కమ్యూనికేషన్ల నుంచి ఇది వేరు చేస్తుందినియంత్రిత ఆర్థిక సంస్థల నుంచి వచ్చే చట్టబద్ధమైన కాల్స్‌ని పౌరులు గుర్తించేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది.

టెలికాం సేవలందించే సంస్థలకు నంబరింగ్ కేటాయింపు తర్వాతబీఎఫ్ఎస్ఐ రంగ సంస్థలు 1600 సిరీస్‌ను అమలు చేసేందుకుట్రాయ్ నిరంతరం టీఎస్‌పీలుబీఎఫ్ఎస్ఐ సంస్థలతో చర్చలు జరిపిందిదీంతో సుమారు 485 సంస్థలు 1600 సిరీస్‌ను అమలు చేశాయిమొత్తం 2800 కంటే ఎక్కువ నంబర్లను పొందాయినమ్మకమైన ఆర్థిక సంస్థల ముసుగులో మోసపూరితతప్పుదోవ పట్టించే కాల్స్ చేయటాన్ని తగ్గించేందుకు.. సేవలులావాదేవీలకు సంబంధించిన కాల్స్ కోసం ప్రామాణిక 10 అంకెల నంబర్లను వినియోగిస్తున్న సంస్థలు కూడా 1600 సిరీస్ నంబర్‌కు మారేందుకు పరిమిత సమయం ఇచ్చి ప్రక్రియను పూర్తి చేయాలని వాటాదారులతో ట్రాయ్ జరిపిన సంప్రదింపుల ద్వారా నిర్ణయించిందినియంత్రణ సంస్థల సంయుక్త కమిటీ (జేసీఓఆర్సమావేశాల్లో జరిగిన చర్చల అనంతరం బీఎఫ్‌ఎస్‌ఐ రంగ నియంత్రణ సంస్థల నుంచి కాలపరిమితులకు సంబంధించిన అభిప్రాయాలను ట్రాయ్ తీసుకుందివారితో జరిపిన సంప్రదింపుల ఆధారంగాదశలవారీ అమలు షెడ్యూల్‌ను ఇప్పుడు విడుదల చేసింది.

ఆదేశాల్లోని కీలక నిబంధనలు

A. సెబీ నియంత్రిత సంస్థలు

i. అన్ని మ్యూచువల్ ఫండ్స్ఆస్తి నిర్వహణ కంపెనీలు (ఏఎంసీలు) 1600 నంబరింగ్ సిరీస్ అమలును ఫిబ్రవరి 15, 2026 నాటికి పూర్తి చేయాలి.

ii. అర్హత గల అన్ని స్టాక్ బ్రోకర్లు (క్యూఎస్ బీలుమార్చి 15, 2026 నాటికి అమలు చేయాలి.

iii. సెబీలో నమోదైన ఇతర మధ్యవర్తులు వారి రిజిస్ట్రేషన్ వివరాలను నిర్ధారించుకున్న తర్వాతస్వచ్ఛందంగా 1600 నంబరింగ్ సిరీస్‌కు మారవచ్చు.

B. ఆర్‌బీఐ నియంత్రిత సంస్థలు

i. వాణిజ్య బ్యాంకులు (పబ్లిక్ సెక్టార్ బ్యాంకులుప్రైవేట్ సెక్టార్ బ్యాంకులువిదేశీ బ్యాంకులు సహాజనవరి 1, 2026 నాటికి తప్పనిసరిగా అమలు చేయాలి.

ii. పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు (రూ.5000 కోట్లకు పైగా ఆస్తుల పరిమాణం గల), పేమెంట్స్ బ్యాంకులుచిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫిబ్రవరి 1, 2026 నాటికి ఈ నిబంధనను పాటించాలి.

iii. మిగిలిన ఎన్‌బీఎఫ్‌సీలుసహకార బ్యాంకులుప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుచిన్న సంస్థలు మార్చి 1, 2026 నాటికి అమలు చేయాలి.

C. పీఎఫ్ఆర్‌డీఏ నియంత్రిత సంస్థలు

i. కేంద్ర రికార్డుల నిర్వహణ సంస్థలు (సీఆర్‌ఏలు), పెన్షన్ ఫండ్ మేనేజర్లు ఫిబ్రవరి 15, 2026 నాటికి నమోదు చేయాలి.

బీమా రంగ సంస్థలు 1600 సిరీస్‌ను అమలు చేయటానికి తుది గడువును తప్పనిసరి చేయాలనే అంశంపై ఐఆర్‌డీఏఐతో చర్చలు జరుగుతున్నాయిచర్చల అనంతరం స్పష్టత రానుంది.

వ్యవస్థీకృతంగా 1600 సిరీస్‌ను అమలు చేయటం వల్ల వినియోగదారుల భద్రత గణనీయంగా మెరుగుపడుతుందివాయిస్ కాల్స్ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను నియంత్రించవచ్చు.

 

***


(Release ID: 2191868) Visitor Counter : 2