కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బాకు నగరంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర కమ్యూనికేషన్ సహాయమంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని


దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు, సరైన విధంగా

తీర్చిదిద్దేందుకు సహకరించాలని బాకులోని ప్రవాస భారతీయులకు పిలుపు


విదేశాల్లో శక్తిమంతంగా భారత్: బలమైన బంధాలు, అభివృద్ధికి కృషి చేయాలని

ప్రవాస భారతీయులకు కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని విజ్ఞప్తి

प्रविष्टि तिथि: 19 NOV 2025 11:02AM by PIB Hyderabad

బాకులోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి కేంద్ర కమ్యూనికేషన్లుగ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం సాయంత్రం ప్రసంగించారుఅంతర్జాతీయ చమురుగ్యాస్ఆతిథ్యంవస్తు వాణిజ్య రంగాల నిపుణులు, 380 మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు సహా 1000 మందికి పైగా వ్యక్తులు ఉత్సాహకంగా సమావేశమవటాన్ని అభినందిస్తూవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

 

సమాజ ఐక్యతను ప్రతిబింబిస్తూ, ఇండియన్ అజర్‌బైజాన్ అసోసియేషన్ది అజర్‌బైజాన్ తెలుగు అసోసియేషన్ది బాకు తమిళ్ సంఘంఅజర్‌బైజన్ ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ వంటి సంఘాల ఏర్పాటును కేంద్ర సహాయమంత్రి ప్రశంసించారుమాతృభూమికి వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ దేశ వారసత్వంతో బలమైన అనుబంధం కలిగి.. ఆధునికమైనదృఢమైనఆకాంక్షాత్మక భారత్‌కు ప్రతీకగా ఈ సమావేశం నిలుస్తుందన్నారు.

 

భారత్‌లో మారుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తూ.. డిజిటల్ ఆవిష్కరణపునరుత్పాదక శక్తిఅంతరిక్ష పరిశోధనలుఆర్థిక చైతన్యం వంటి అంశాల్లో దేశ ప్రగతిని వివరించారుభారత్ ప్రయాణంలో ప్రవాస భారతీయులు అంతర్గతంగా ఉంటారనివారి విజయాలు ప్రపంచస్థాయిలో భారత్ స్థానాన్ని పెంచుతాయనివారి పెట్టుబడులు అవకాశాలను కల్పిస్తాయనివారి పిల్లలు దేశాల సంస్కృతుల మధ్య భవిష్యత్ వారధులుగా ఉంటారని తెలిపారు.

యువతను ఉద్దేశించి మాట్లాడిన కేంద్ర సహాయమంత్రి.. ప్రాచీన భారత మేధస్సును ఆధునిక భిన్న సంస్కృతుల ఆలోచనలతో జోడించితమ ద్వంద్వ గుర్తింపును గర్వంగా స్వీకరించాలన్నారుఇక్కడి ప్రజలంతా భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తూ.. విజ్ఞానాన్ని పంచుకోవాలనియువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకులుగా ఉండాలనిభారత్ అభివృద్ధికి తమ వంతు సహకరించాలని ఆయన కోరారుప్రవాస భారతీయులకు భారత్ ప్రాధాన్యతనిస్తుందనివారి కోసం భారత్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేస్తూ ప్రసంగాన్ని ముగించారు.

 

***


(रिलीज़ आईडी: 2191655) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil