రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత నావికా దళంలో చేరనున్న మొదటి ఏఎస్‌డబ్ల్యూ-ఎస్‌డబ్ల్యూసీ నౌక ‘మహే’


కొచ్చిన్‌ షిప్‌యార్డ్ సంస్థ నిర్మిస్తున్న 8 ఏఎస్‌డబ్ల్యూ-ఎస్‌డబ్ల్యూసీ నౌకల్లో మొదటిది 'మహే'‌

Posted On: 16 NOV 2025 5:52PM by PIB Hyderabad

దేశీయ నౌకానిర్మాణ ప్రయాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కొచ్చిన్ షిప్‌యార్డ్ సంస్థ (సీఎస్ఎల్) నిర్మించిన 8 ఏఎస్‌డబ్ల్యూ-ఎస్‌డబ్ల్యూసీ శ్రేణి నౌకల్లో మొదటిదైన 'మహే' నౌకను 2025 నవంబర్ 24న ముంబయిలోని నౌకాశ్రయంలో భారత నావికా దళానికి అప్పగించనున్నారు. 

'మహే' నౌక‌ను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ‌తయారుచేసింది. ఇది నావికాదళానికి సంబంధించిన నౌకల రూపకల్పన, తయారీలో 'ఆత్మనిర్భర్ భారత్' అత్యధునిక సాంకేతికను తెలియజేస్తోంది. ఈ నౌక చిన్నగా ఉన్నప్పటికీ శక్తివంతమైనది. ఇది చురుకుగా కదులుతూ ఖచ్చితత్వంతో ఎక్కువ సేపు కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తీరప్రాంత జలాలలో ఆధిపత్యం చెలాయించేందుకు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన ఈ లక్షణాల వల్ల ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. 

శక్తివంతమైన ఆయుధ సామగ్రి, ప్రత్యర్థులకు చిక్కకుండా ఉండే సామర్థ్యం, వేగవంతమైన కదలిక‌తో కూడిన ఈ నౌక జలాంతర్గాములపై దాడి చేయటం, తీరప్రాంత గస్తీ నిర్వహించటం, భారతదేశానికి కీలకమైన సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచటం వంటి పనులు చేస్తుంది. 

యుద్ధనౌక రూపకల్పన, తయారీ, ఇంటిగ్రేషన్‌ విషయంలో భారతదేశంలో పెరుగుతున్న నైపుణ్యాన్ని.. 80 శాతం కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్న ఈ 'మహే' శ్రేణి తెలియజేస్తోంది. మలబార్ తీరంలో ఉన్న చారిత్రక పట్టణం మహే పేరు దీనికి పెట్టారు. ఈ నౌక చిహ్నంలో 'ఉరుమి' (కలరిపయట్టులో ఉపయోగించే అనువైన కత్తి) ఉంది. ఇది చాకచక్యం, కచ్చితత్వం, తీవ్రమైన గాంభీర్యాన్ని సూచిస్తుంది. 

తక్కువ లోతు జలాల్లో కార్యకలాపాలు నిర్వహించే చిన్న పరిమాణం, వేగంగా కదిలే కొత్త తరం పూర్తి స్వదేశీ యుద్ధనౌకల ఆగమనాన్ని ఈ 'మహే' నౌక తెలియజేస్తోంది. 

 

***


(Release ID: 2190642) Visitor Counter : 16