రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

అంగోలా 50వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్న భారత రాష్ట్రపతి


రెండు దేశాల పర్యటనలో చివరి రోజు బోట్స్‌వానాకు చేరుకున్న రాష్ట్రపతి

Posted On: 12 NOV 2025 7:18AM by PIB Hyderabad

అంగోలా అధ్యక్షుడు శ్రీ జొవావో మేన్యుయల్ గొన్‌సాల్వెస్ లొరెన్సో ఆహ్వానాన్ని అందుకొని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము 2025 నవంబరు11న అంగోలా 50వ స్వాతంత్య్ర దినోత్సవంలో పాలుపంచుకొన్నారు. లువాండాలోని ప్రాకా దా రిపబ్లికాలో ఏర్పాటు చేసిన కనువిందైన కార్యక్రమంలో భాగంగా సైన్య, సాంస్కృతిక సంప్రదాయానుసారంగా సాగిన ఆకర్షణీయ ప్రదర్శనలను అంగోలా అధ్యక్షుడు శ్రీ లొరెన్సోతో పాటు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము తిలకించారు.


 image.png

image.png

 


రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఆఫ్రికాలో రెండు దేశాల పర్యటన చివరి అంకంలో భాగంగా, బోట్స్‌వానాలోని గైబొరోన్‌లో గల సర్ సెరత్సే ఖామా అంతర్జాతీయ  విమానాశ్రయానికి చేరుకొన్నారు. భారత దేశాధినేత  బోట్స్‌వానాలో ఆధికారికంగా పర్యటించడం ఇదే మొదలు.
  

 

 image.png

 

 image.png

 

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము విమానాశ్రయానికి చేరుకోగానే బోట్స్‌వానా అధ్యక్షుడు గౌరవ అడ్వొకేట్ డ్యూమా గిదోన్ బొకో రాష్ట్రపతికి సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి గౌరవార్థం సంప్రదాయ ఆహ్వాన కార్యక్రమంతో పాటు గౌరవ వందనాన్ని కూడా ఏర్పాటు చేసి, భారత్- బోట్స్‌వానా మైత్రి ఎంత ప్రగాఢమైందో చాటిచెప్పారు.

 

***


(Release ID: 2189161) Visitor Counter : 17