సహకార మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోని పది అగ్రశ్రేణి సహకార సంఘాలలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఆనంద్ మిల్క్ యూనియన్ సంస్థ (అముల్), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ సంస్థ (ఇఫ్కో) లను అభినందించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
ఇది భారతదేశానికి గర్వకారణం: శ్రీ అమిత్ షా
అముల్‌తో అనుబంధం కలిగి ఉన్న లక్షలాది మంది మహిళల, ఇఫ్కో కు తోడ్పడుతున్న రైతుల అవిశ్రాంత కృషికి ఇది ఒక గౌరవం.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధికారత, స్వావలంబనకు ప్రపంచ నమూనాగా మారుతున్న సహకార సంఘాల అపరిమితమైన సామర్థ్యానికి ఇది నిదర్శనం.
प्रविष्टि तिथि:
04 NOV 2025 10:26PM by PIB Hyderabad
ప్రపంచంలోని మొట్టమొదటి పది సహకార సంఘాలలో తొలి రెండు స్థానాలను సాధించినందుకు అమూల్, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (ఇఫ్కో) లను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అభినందించారు.
''భారతదేశానికి ఇది ఎంతో గర్వకారణం. ప్రపంచంలోని మొదటి పది సహకార సంఘాలలో తొలి రెండు స్థానాలను సాధించినందుకు అమూల్, ఇఫ్కోలకు హృదయపూర్వక అభినందనలు. అమూల్ తో అనుబంధం ఉన్న లక్షలాది మంది మహిళలు, ఇఫ్కోకు సహకరిస్తున్న రైతుల అవిశ్రాంత అంకితభావానికి ఇది ఒక గౌరవం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధికారత, స్వావలంబనకు ప్రపంచ నమూనాగా మారుతున్న సహకార సంఘాల అపరిమితమైన సామర్థ్యానికి ఇది నిదర్శనం” అని శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్టు చేశారు.
***
(रिलीज़ आईडी: 2186790)
आगंतुक पटल : 21