వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
బ్రాసోవ్ లో జరిగిన భారతదేశం-రొమేనియా బిజినెస్ ఫోరమ్ లో భారత వ్యాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ జితిన్ ప్రసాద
प्रविष्टि तिथि:
05 NOV 2025 8:50AM by PIB Hyderabad
ఇవాళ జరిగిన ఇండియా-రొమేనియా బిజినెస్ ఫోరమ్‌లో భారత వ్యాణిజ్య ప్రతినిధి బృందానికి వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీ జితిన్ ప్రసాద నాయకత్వం వహించారు. దీన్ని బుకారెస్ట్‌లోని భారత రాయబార కార్యాలయం, భారత ప్రభుత్వ పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగ (డీపీఐఐటీ) భాగస్వామ్యంతో బ్రాసోవ్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (సీసీఐబీవీ) నిర్వహించింది.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడులు, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించటంపై ఈ సమావేశం దృష్టి పెట్టింది. ఆటోమోటివ్, ఏరోస్పేస్, రక్షణ, పునరుత్పాదక శక్తి, ఇంజినీరింగ్ సేవలు, ఐసీటీ వంటి ప్రాధాన్యతా రంగాల వ్యాపార ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
శ్రీ ప్రసాద ప్రసంగిస్తూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదక అనుబంధ ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాల ద్వారా భారత్ లోని శక్తిమంతమైన తయారీ రంగం, ఆవిష్కరణ వ్యవస్థలో పాల్గొనాలని రొమేనియన్ సంస్థలను ఆహ్వానించారు.
"భారత్ లో వ్యాపార అవకాశాలు" అనే అంశంపై జరిగిన ప్రదర్శనలో విధాన సంస్కరణలు, సులభతర వాణిజ్య మార్గాలు, కీలకమైన పారిశ్రామిక కారిడార్లలో రాష్ట్ర స్థాయి ప్రోత్సాహకాల గురించి వివరించారు. ఈ సమావేశంలో భారత్, రొమేనియా కంపెనీల మధ్య జాయింట్ వెంచర్లు, సాంకేతిక భాగస్వామ్యాలను అన్వేషించేందుకు చర్చలతో పాటు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
భారత వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలకు కీలకంగా బ్రాసోవ్ ఫోరం నిలిచింది. మధ్య, తూర్పు యూరప్ తో భారత్ కున్న అనుబంధాన్ని బలోపేతం చేసింది. సుస్థిర తయారీ, గ్రీన్ ఎనర్జీ, అత్యాధునిక సాంకేతికత గల పరిశ్రమలతో దీర్ఘకాలిక ఆర్థిక అనుసంధానానికి రెండు దేశాల ప్రాధాన్యతను స్పష్టం చేసింది.
బ్రాసోవ్ నగరం ఆధునిక రొమేనియాకు ప్రతీక. ఇక్కడ సంప్రదాయ పరిశ్రమలు ఆధునిక సాంకేతికతతో అనుసంధానం అవుతాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుంది. నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ఈ స్ఫూర్తి మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి భారత్ లక్ష్యాలకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థల సమ్మిళిత వృద్ధికి ఇంధనంగా పనిచేస్తుంది. బ్రాసోవ్ పారిశ్రామిక శక్తికి, భారత తయారీ, డిజైన్, ఇంజినీరింగ్ సామర్థ్యాల మధ్య సహకారానికి అపారమైన అవకాశముంది.
***
(रिलीज़ आईडी: 2186783)
आगंतुक पटल : 16