ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర ప్రమాదం, ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం


పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

Posted On: 03 NOV 2025 5:15PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని  ఆకాంక్షించారు.

 

మృతుల కుటుంబాలకు జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ప్రధానమంత్రి  నష్ట పరిహారాన్ని ప్రకటించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం “ఎక్స్”లో  ఇలా పోస్ట్ చేసింది.. 

“రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది.  ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాదంలో తమ సన్నిహితులను కోల్పోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 నష్టపరిహారాన్ని అందిస్తాం’’

 

***


(Release ID: 2186109) Visitor Counter : 7