ఉప రాష్ట్రపతి సచివాలయం
                
                
                
                
                
                    
                    
                        తెలంగాణలో రోడ్డు ప్రమాదం..  ప్రాణ నష్టం.. సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                03 NOV 2025 12:20PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ప్రాణనష్టానికి దారితీసింది. దీనిపై ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం  చేశారు.
ఈ  విషాదసంఘటన ప్రాణనష్టానికి దారితీయడం ఎంతగానో కలచివేసిందని ఒక సందేశంలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధితులకూ, వారి కుటుంబాలకూ కలిగిన దు:ఖంలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు  ఆయన తెలిపారు.
ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు శ్రీ సీపీ రాధాకృష్ణన్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
                
                
                
                
                
                (Release ID: 2185790)
                Visitor Counter : 13