ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
01 NOV 2025 9:33AM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉజ్వలమైన చరిత్ర, సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి మధ్యప్రదేశ్ పేరెన్నికగన్నదని ఆయన పేర్కొన్నారు. తదనుగుణంగా నేడు ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యంతో ప్రతి రంగంలోనూ శరవేగంగా పురోగమిస్తున్నదని తెలిపారు. వికసిత భారత్ స్వప్న సాకారంలో మధ్యప్రదేశ్ ప్రజల ప్రతిభ, కృషి ఎనలేని పాత్ర పోషించగలవని ఆయన ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఒక ప్రకటనలో:
“ఉజ్వల చరిత్ర, సుసంపన్న సాంస్కృతిక వారసత్వం మధ్యప్రదేశ్ సొంతం. ఈ రోజు వ్యవస్థాపన దినోత్సవం నిర్వహించుకుంటున్న ఈ రాష్ట్రంలోని నా కుటుంబ సభ్యులందరికీ అనేక అభినందనలు. దేశం నడిబొడ్డునగల ఈ రాష్ట్రం నేడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి రంగంలోనూ శరవేగంతో ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో దేశం ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్రంలోని ప్రతిభాశాలురు, శ్రమించే తత్వంగల ప్రజలు అసాధారణ పాత్ర పోషించగలరనే నమ్మకం నాకుంది" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2185533)
आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam