రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ‘నో యువర్ వెహికల్’ (కేవైవీ) ప్రక్రియను సరళతరం చేసిన ఎన్ హెచ్ఏఐ

Posted On: 30 OCT 2025 6:52PM by PIB Hyderabad

ఫాస్టాగ్ వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచిఅనుభవాన్ని మెరుగుపరచడానికి నో యువర్ వెహికిల్  (కేవైవీప్రక్రియను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్ హెచ్ఏఐ)  సరళతరం చేసిందిఇండియన్ హైవేస్ మేనేజ్ మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్జారీ చేసిన సవరించిన మార్గదర్శకాల ప్రకారంనిబంధనలు పాటించని వాహనాల ఫాస్టాగ్ సేవలను నిలిపివేయరుకేవైవీ ప్రక్రియను పూర్తిచేసేందుకు వారికి తగిన సమయం ఇస్తారు.

సరళతరం చేసిన కేవైవీ మార్గదర్శకాల ప్రకారంకారుజీప్వాన్ వాహనాల పక్కదిశ (సైడ్ఫోటోలు ఇకపై అవసరం లేదువాహనం నంబర్ ప్లేట్ఫాస్టాగ్ కనిపించే ముందు భాగం ఫోటో మాత్రమే అప్‌లోడ్ చేయాలివినియోగదారులు వాహన సంఖ్యఛాసిస్ సంఖ్య లేదా మొబైల్ నెంబరును నమోదు చేసినప్పుడువాహన్ ద్వారా ఆర్సీ వివరాలను ఆటోమేటిక్‌గా పొందేందుకు కూడా నిబంధనలు చేరుస్తున్నారుఒకే మొబైల్ నెంబరుతో బహుళ వాహనాలు రిజిస్టర్ అయి ఉంటే వినియోగదారులు తాము కేవైవీని పూర్తి చేయాలనుకుంటున్న వాహనాన్ని ఎంచుకోవలసి ఉంటుంది.

సేవలను నిరంతరాయంగా కొనసాగించడానికి వీలుగా కేవైవీ విధానం అమలుకు ముందు జారీ చేసిన ఫాస్టాగ్ లు యథావిధిగా కొనసాగుతాయిఅయితే ట్యాగ్‌ వదులుగా ఉన్నట్టులేదా దుర్వినియోగం అవుతున్నట్టు ఫిర్యాదులు వస్తే తగిన చర్యలు తీసుకుంటారుఅలాగేవాటిని జారీ చేసిన బ్యాంకులు కేవైవీ ప్రక్రియను పూర్తి చేయాలని గుర్తు చేస్తూ వినియోగదారులకు ఎస్ఎంఎన్ లు పంపుతాయి.

ఒక వేళ పత్రాలు అప్‌లోడ్ చేయడంలో వినియోగదారు ఇబ్బంది ఎదుర్కొంటేదానిని జారీ చేసిన బ్యాంకు కనెక్షన్ నిలిపివేయడానికి ముందే చురుగ్గా స్పందించి కస్టమర్‌ను సంప్రదించికేవైవీ ప్రక్రియను పూర్తి చేయడంలో సహాయపడుతుందిఅలాగేవినియోగదారులు తమ బ్యాంకుతో కేవైవీ సమస్యలు ఏవైనా ఉంటే ఫిర్యాదులు లేదా సందేహాలను నేషనల్ హైవే హెల్ప్‌లైను నెంబరు - 1033  ద్వారా తెలుపవచ్చు.

వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడంఫాస్టాగ్ వ్యవస్థను బలోపేతం చేయడందేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వినియోగదారులకు సజావుగాఅంతరాయం లేని ప్రయాణ అనుభవాన్ని అందించడం పట్ల  నిబద్ధతలో భాగంగా ఎన్ హెచ్ఏఐ కేవైవీ నిబంధనలను సులభతరం చేస్తోంది

 

***


(Release ID: 2184447) Visitor Counter : 7