రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024-25 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూలు వ్యయంలో రూ.2,062 కోట్లు ఆదా చేసిన ఎన్‌హెచ్ఏఐ

Posted On: 30 OCT 2025 4:45PM by PIB Hyderabad

ప్రజా నిధులతో నిర్వహించే టోల్ ప్లాజాల్లో టోల్ వసూలు వ్యయాన్ని ఎన్‌హెచ్ఏఐ రూ.2,062 కోట్ల మేర తగ్గించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,736 కోట్లుగా ఉన్న టోల్ వసూలు వ్యయం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,674 కోట్లకు తగ్గిందిదీంతో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎన్‌హెచ్ఏఐకి రూ.2,062 కోట్ల మేర ఆదా అయిందిశాతం పరంగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17.27 శాతం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 9.27 శాతానికి తగ్గిందిటోల్ ప్లాజాల వద్ద టోలింగ్ ఏజెన్సీలు వసూలు చేసిన ఫీజుకిఎన్‌హెచ్ఏఐకి జమ చేసిన మొత్తానికి మధ్య తేడాని 'టోల్ వసూలు ఖర్చుఅంటారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలోటోల్ ఏజెన్సీలు వసూలు చేసిన మొత్తం టోల్ రుసుము రూ.27,417 కోట్లు కాగాఅందులో సుమారు రూ.22,681 కోట్లు ఎన్‌హెచ్ఏఐకి జమ అయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోటోల్ ఏజెన్సీలు సుమారు రూ.28,823 కోట్ల టోల్ రుసుముని వసూలు చేయగాఅందులో దాదాపు రూ.26,149 కోట్లు

ఎన్‌హెచ్ఏఐకి జమ అయ్యాయిఎన్‌హెచ్ఏఐ చేపట్టిన కార్యక్రమాలే టోల్ వసూలు ఖర్చులో ఆదాకు ప్రధాన కారణంప్రస్తుత కాంట్రాక్టులను పర్యవేక్షించటం, 3 నెలల డీమ్డ్ పొడిగింపు నిబంధన తొలగించటంసకాలంలో టెండర్లు ఆహ్వానించటంగరిష్ఠంగా ఏడాది కాల వ్యవధికి కాంట్రాక్టులు మంజూరయ్యేలా చూడటంమూడు నెలల స్వల్పకాలిక కాంట్రాక్టులను కనిష్ఠ స్థాయికి తగ్గించటం వంటి చర్యలు తీసుకుంది.

స్వల్పకాలిక మూడు నెలల కాంట్రాక్టులను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారుఒక ఆర్థిక సంవత్సరంలో ముందస్తు రద్దు అభ్యర్థనలను మూడుకు పరిమితం చేశారుముందస్తు రద్దు అభ్యర్థనను సమర్పించిన అదే కాంట్రాక్టరును ఆ టోల్ ప్లాజా వేలంలో పాల్గొనకుండా నిషేధించారు.

టోల్ వసూలు ఏజెన్సీలు ఎదుర్కొంటున్న సమస్యలుసవాళ్లను పరిష్కరించటానికివాటిలో విశ్వాసాన్ని పెంచటానికిటోల్ టెండర్లలో పాల్గొనేవారి సంఖ్యను పెంచేందుకు, 'ఆల్ ఇండియా యూజర్ ఫీ కలెక్షన్ ఫెడరేషన్'తో ఎన్‌హెచ్ఏఐ క్రమం తప్పకుండా చర్చలు జరుపుతోందిసమయానికి టోల్ వసూలు ఏజెన్సీల నిర్వహణ భద్రత (నగదు భాగం), బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేయటం వలన టెండర్ సామర్థ్యాలు పెరిగి ఎక్కువ బిడ్లు దాఖలయ్యాయి..

టోల్ వసూలు ఏజెన్సీలకు ఆకస్మిక లాభాలను నివారించటానికిఒప్పందాల్లో'ఆకస్మిక లాభాల క్లాజ్'ని కూడా ప్రవేశపెట్టారు. దీని ప్రకారంచివరి 15 రోజుల్లో టోల్ వసూలు సగటు.. ఎన్హెచ్ఏఐకి చెల్లించిన వాయిదాలో40 శాతం కంటే ఎక్కువగా ఉంటేఆ టోల్ వసూలు ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేయవచ్చు.

టోలింగ్ కార్యకలాపాలను మెరుగుపరచటానికి చేపట్టిన చర్యలు.. దేశవ్యాప్తంగా టోల్ కార్యకలాపాల్లో సామర్థ్యాన్నిపారదర్శకతను పెంచటానికి ఎన్హెచ్ఏఐ నిరంతరస్థిరమైన అంకితభావాన్ని స్పష్టం చేస్తున్నాయి.

 

***

 

(Release ID: 2184250) Visitor Counter : 11