జపాన్ ప్రధానమంత్రి హెచ్ఈ సానే తకాయిచీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు.
ప్రధానమంత్రి తకాయిచీ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలిపిన శ్రీ నరేంద్ర మోదీ, ఆమె పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పారు.
ఆర్థిక భద్రత, రక్షణ సహకారం, టాలెంట్ మొబిలిటీపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉమ్మడి దృక్పథంపై ఇరుదేశాల నేతలు చర్చించారు.
భారత్-జపాన్ మధ్య దృఢమైన సంబంధాలు.. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధికి కీలకమని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"జపాన్ ప్రధానమంత్రి సానే తకాయిచీతో హృదయపూర్వక సంభాషణ జరిగింది. పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉమ్మడి దృక్పథంపై చర్చించాం. ముఖ్యంగా ఆర్థిక భద్రత, రక్షణ సహకారం, టాలెంట్ మొబిలిటీ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాం. బలమైన భారత్-జపాన్ సంబంధాలు ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సుకు అత్యంత కీలకమని భావించాం.
@takaichi_sanae”