బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోల్ అనలటిక్స్ డాష్ బోర్డు ‘‘కోయ్‌లా శక్తి ’’ని ప్రారంభించనున్న మంత్రిత్వశాఖ

प्रविष्टि तिथि: 28 OCT 2025 2:08PM by PIB Hyderabad

డిజిటల్ మార్పుడేటా ఆధారిత పరిపాలన దిశగా కీలక చర్యల్లో భాగంగా.. బొగ్గు మంత్రిత్వ శాఖ “కోయ్‌లా శక్తి” అనే బొగ్గు అనలిటిక్స్ డాష్బోర్డ్ ను ప్రారంభించనుందిఇది బొగ్గు రంగంలోని కార్యకలాపాలను ఒకే వేదికపై సమయానుకూలంగా పర్యవేక్షించడానికివిశ్లేషించడానికి ఉపయోగపడుతుంది ప్రారంభోత్సవ కార్యక్రమం 2025 అక్టోబర్ 29 న్యూఢిల్లీలోని ది ఒబెరాయ్ హోటల్ లో జరగనుంది కార్యక్రమానికి బొగ్గుగనుల మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు.

సాంకేతికత ఆధారిత పాలన ద్వారా డిజిటల్ ఇండియాను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా బొగ్గు మంత్రిత్వ శాఖ.. బొగ్గు రంగంలో డిజిటల్ వ్యవస్థలను ఏకీకృతం చేయడానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందికోయ్‌లా శక్తి ప్రారంభం  ప్రయత్నంలో కీలక మైలురాయిని సూచిస్తుంది వేదిక ద్వారా బొగ్గు ఉత్పత్తిరవాణాసరఫరాపై సమగ్ర డిజిటల్ పర్యవేక్షణ సాధ్యమవుతుందిడేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు సహకరిస్తుందిమొత్తం బొగ్గు వ్యవస్థలో పారదర్శకతసామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

బొగ్గు ఉత్పత్తిడిమాండ్రవాణాపంపిణీకి సంబంధించిన డేటాను ఒకేచోట సమగ్రపరిచివిశ్లేషించడానికి కోయ్‌లా శక్తి వేదికను రూపొందించారుదీనిద్వారా బొగ్గు రంగంలో పారదర్శకతకార్యనిర్వహక సామర్థ్యం బలోపేతం కానుంది వేదికతో సమయానుకూల రిపోర్టింగ్పనితీరు ట్రాకింగ్సలభతరమైన రవాణా సాధ్యమవుతుందిబొగ్గు రంగంలోని భాగస్వాముల మధ్య సమాచారం సజావుగా సాగడం తద్వారా నిర్ణయాలు వేగంగాసమర్థవంతంగా తీసుకునేందుకు వీలవుతుంది

డాష్బోర్డ్ గురించి

బొగ్గు మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన కోయ్‌లా శక్తి - స్మార్ట్ కోల్ అనలిటిక్స్ డాష్బోర్డ్.. అనేక భాగస్వాముల నుంచి డేటాను సమగ్రపరిచే కేంద్రీకృత డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. ఇందులో ఉండే అంశాలు:

·         బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థలుప్రైవేటు గని కార్మికులు

·         బొగ్గురైల్వేలువిద్యుత్ఆర్థికంఓడరేవులుషిప్పింగ్జలమార్గాలురోడ్డు రవాణారహదారులు వంటి కేంద్ర మంత్రిత్వ శాఖలువిభాగాలు

·         బొగ్గు ఉత్పత్తిని నిర్వహించే రాష్ట్రస్థాయి విభాగాలు (-ఖనిజ్ వేదికలు)

·         విద్యుత్ ఉత్పత్తి సంస్థలుఇతర పారిశ్రామిక బొగ్గు వినియోగదారులు

·         పోర్టు అధికారులుప్రైవేటు బొగ్గు నిర్వహణ టెర్మినల్స్

ముఖ్య ఉద్దేశాలుప్రధాన లక్షణాలు

బొగ్గు సరాఫరా వ్యవస్థంలో కార్యనిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపారదర్శకతను ప్రోత్సహించడంవిభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంకోయ్‌లా ప్రధాన లక్ష్యం

1. సమగ్ర అవగాహన : వివిధ మూలల నుంచి వచ్చే సమాచారాన్ని ఒకేసమగ్ర ఇంటర్ఫేస్లో సమన్వయం చేయడం.

2. సమయానుకూల పర్యవేక్షణ : బొగ్గు ఉత్పత్తిపంపిణీరవాణా కార్యకలాపాలను నిరంతరంగా ట్రాక్ చేయడం.

3. డేటా ఆధారిత నిర్ణయాలువిధానాల రూపకల్పననిర్వహణ నిర్ణయాలకు విశ్లేషణాత్మక సాధనాలు.

4. ఘటన స్పందనసకాలంలో హెచ్చరికలునోటిఫికేషన్ల ద్వారా ఆపరేషనల్ సమస్యలను త్వరగా పరిష్కరించడం.

5. ప్రామాణీకరణ : అన్ని విభాగాల్లో ఒకే విధమైన ప్రమాణాలునివేదిక ఫార్మాట్లు అమలు చేయడం

6. కార్యనిర్వహణ సామర్థ్యంపర్యవేక్షణరిపోర్టింగ్ ప్రక్రియలను సులభతరం చేయడంమానవ తప్పిదాలను తగ్గించడం.

7.విస్తరణ సామర్థ్యం : భవిష్యత్తులో కొత్త డిజిటల్ వ్యవస్థలతో అనుసంధానం చేసుకునే సామర్థ్యం.

8. పారదర్శకత, బాధ్యతఅన్ని భాగస్వాములకు పనితీరు సూచికల మెరుగైన దృశ్యమానాన్ని మెరుగుపరచడం

9. విధాన ప్రణాళికఅంచనాడిమాండ్ ను అంచనా వేయడంవ్యూహాత్మక ప్రణాళికకు విశ్లేషణాత్మక సమాచారం అందించడం.

డిజిటల్ ఇండియా మిషన్ను ముందుకు తీసుకెళ్లడం

ప్రధానమంత్రి నాయకత్వంలో భారత ప్రభుత్వం అన్ని రంగాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోంది దిశగా ‘‘కోయ్‌లా శక్తి’’ ప్రారంభం.. బొగ్గు పాలనలో పారదర్శకతజవాబుదారీతనంసామర్థ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా బొగ్గు మంత్రిత్వశాఖ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

సాంకేతికత ఆధారంగా వనరుల స్థిరమైన నిర్వహణమెరుగైన కార్యాచరణ పర్యవేక్షణప్రజల నమ్మకాన్ని పెంపొందంచడానికి మంత్రిత్వశాఖ కృషి చేస్తుంది ప్రయత్నం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలపరిచే దిశగాదీర్ఘకాలిక ఇంధన భద్రతకు మద్దతు ఇస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2183574) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam