సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర విజిలెన్స్ కమిషన్ కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవం-2025

Posted On: 27 OCT 2025 6:34PM by PIB Hyderabad

కేంద్ర విజిలెన్స్ కమిషన్‌ నేడు న్యూఢిల్లీలోని సతర్కతా భవన్‌లో ‘‘విజిలెన్స్ అవగాహన వారోత్సవం -2025’’ కార్యక్రమాన్ని నిర్వహించింది.  కేంద్ర విజిలెన్స్ కమిషనర్ శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవవిజిలెన్స్ కమిషనర్ శ్రీ ఏ.ఎస్రాజీవ్.. ఉదయం 11 గంటలకు కమిషన్ అధికారులతో సచ్ఛీలతా ప్రమాణం చేయించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

‘‘విజిలెన్స్మనందరి బాధ్యత’’ ఇతివృత్తంతో 2025 అక్టోబర్ 27 నుంచి నవంబర్ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారుగత కొన్ని సంవత్సరాలుగా కమిషన్.. విజిలెన్స్ అవగాహన వారోత్సవానికి అనుబంధంగా మూడు నెలలపాటు ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తోందిఈ సంవత్సరం ఈ ప్రచారం ఆగస్టు 18 నుంచి నవంబర్ 17 వరకు కొనసాగుతుందిఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలువిభాగాలుసంస్థలు  కింద పేర్కొన్న అయిదు ప్రధాన  అంశాలపై దృష్టి సారిస్తాయిఅవి:

a) 2025 జూన్ 30కు ముందు వచ్చిన పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారం.

b) పెండింగ్ కేసుల పరిష్కారం.

c) సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాలు.

d) ఆస్తుల నిర్వహణ.

e) డిజిటల్ ఆవిష్కరణలు.

ఈ అంశాలపై దృష్టి సారించడం వల్ల విజిలెన్స్ పరిపాలనపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

విజిలెన్స్ అవగాహన వారోత్సవం -2025లో భాగంగా కమిషన్ “నైతిక పరిపాలనకు కృత్రిమ మేధఅభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు’’ అన్న అంశంపై అక్టోబర్ 31న ఒక రోజు వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది.

 

***


(Release ID: 2183112) Visitor Counter : 3