సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెండింగ్‌లో ఉన్న అంశాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రచారం 5.0పై పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమ విభాగం మధ్యంతర సమీక్ష

Posted On: 27 OCT 2025 10:18AM by PIB Hyderabad

పెండింగ్‌లో ఉన్న అంశాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రచారం 5.0 (ఎస్‌సీడీపీఎం 5.0)లో భాగంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను తగ్గించేందుకుస్వచ్ఛతను ప్రోత్సహించేందుకుఅంతర్గత పర్యవేక్షణను విస్తరించేందుకురికార్డుల నిర్వహణను మెరుగుపరిచేందుకు పింఛనుపింఛనుదారుల సంక్షేమ విభాగం (డీవోపీపీడబ్ల్యూసమగ్ర చర్యలు చేపట్టింది.

మధ్యంతర సమీక్షలో భాగంగా 2025, అక్టోబర్ 24 నాటికి గుర్తించిన విజయాలు:

  • ప్రజా ఫిర్యాదులు (పీజీరసీదులుపరిష్కారంఅప్పీళ్లతో సహా లక్షిత ప్రజా ఫిర్యాదుల్లో సుమారుగా 83 శాతం (నిర్దేశించిన లక్ష్యం 7,500లో 6,166 పరిష్కారమయ్యాయి.

  • ఫైళ్ల సమీక్షనిరుపయోగమైన ఫైళ్ల తొలగింపు: సమీక్ష కోసం గుర్తించిన 2,409 ఫైళ్లలో గుర్తించిన నిరుపయోగమైన వాటిని 100 శాతం (261) తొలగించారుఇది స్థల నిర్వహణకు తోడ్పడిందిఅలాగే.. 5,300 -ఫైళ్లను సమీక్షించి వాటిలో 31 ఫైళ్లను ఈ-వ్యర్థాలు నిబంధనలకు అనుగుణంగా తొలగించేందుకు గుర్తించారు.

  • స్వచ్ఛతా ప్రచారాలు: దేశవ్యాప్తంగా గుర్తించిన 59 ప్రాంతాల్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారుదీనిలో 2025, అక్టోబర్ 1న సహాయ మంత్రి (పీపీఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఉంది.

‘‘పాలనా సౌలభ్యం’’ ద్వారా జీవన సౌలభ్యాన్ని అందించేందుకుకార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛతను కొనసాగించేందుకు ఈ విభాగం కట్టుబడి ఉంది.

 

***


(Release ID: 2183088) Visitor Counter : 7