రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్‌కు చేరుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
సైనిక కమాండర్ మేజర్ జనరల్ యూసఫ్ మాయుఫ్ సయీద్ అల్ హల్లామీ
Posted On:
27 OCT 2025 4:55PM by PIB Hyderabad
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైనిక బలగాల కమాండర్ మేజర్ జనరల్ యూసఫ్ మాయుఫ్ సయీద్ అల్ హల్లామీ 2025 అక్టోబర్ 27, 28 తేదీల్లో భారత్‌లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ద్వైపాక్షిక సైనిక సహకారాన్ని విస్తరించడానికి, భాగస్వామ్యానికి ముఖ్యంగా శిక్షణ, సామర్థ్య విస్తరణ అంశాల్లో కొత్త అవకాశాలను అన్వేషించడమే ఈ ఉన్నత స్థాయి పర్యటన లక్ష్యం. రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న రక్షణ మైత్రిని మరింత బలోపేతం చేయడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఇది తెలియజేస్తుంది.
మేజర్ జనరల్ యూసఫ్ మాయుఫ్ సయీద్ అల్ హల్లామీకి అధికారిక స్వాగతం పలికి.. ఆపరేషన్ సిందూర్ గురించి సమగ్రంగా వివరించారు. ఆయనకు దేశ రక్షణ సామర్థ్యాలు, సైన్యం కోసం కృత్రిమ మేధ ప్రణాళిక గురించి భారత ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆర్మీ డిజైన్ బ్యూరో డీజీ వివరించారు.
జాతీయ యుద్ధ స్మారకం వద్ద మేజర్ జనరల్ యూసఫ్ మాయుఫ్ సయీద్ అల్ హల్లామీ 2025, అక్టోబర్ 28న పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తారు. అనంతరం డీఆర్‌డీవోను సందర్శించి దేశీయంగా అభివృద్ధి చేసిన వివిధ ఆయుధాలు, పరికరాల గురించి తెలుసుకుంటారు. అలాగే రక్షణ శాఖ కార్యదర్శి, డీఆర్డీవో ఆర్ అండ్ డీ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్‌తో చర్చిస్తారు. పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై భారతీయ రక్షణ రంగ పరిశ్రమల ప్రతినిధులతో కూడా కమాండర్ సంభాషిస్తారు.
రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారంలో ముఖ్యమైన విజయాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైనిక బలగాల కమాండర్ మేజర్ జనరల్ యూసఫ్ మయూఫ్ సయీద్ అల్ హల్లామీ పర్యటన సూచిస్తుంది. ఇప్పటికే దృఢంగా ఉన్న రక్షణ సంబంధాలను ఈ పర్యటన మరింత విస్తరిస్తుంది. సైనిక భాగస్వామ్యం, ప్రాంతీయ భద్రతా సహకారంలో బలమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న భాగస్వామ్యానికి మార్గం సుగమం చేస్తుంది.
***
(Release ID: 2183055)
Visitor Counter : 9