శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐసీఎంఆర్, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో మహా మెడ్ టెక్ మిషన్ ను ప్రారంభించిన ఏఎన్ఆర్ఎఫ్


భారతదేశంలో వైద్య రంగంలో సాంకేతికతను బలోపేతం చేసేందుకు మహా మెడ్ టెక్ మిషన్

కాన్సెప్ట్ నోట్ సమర్పించేందుకు నవంబర్ 7, 2025 చివరి తేదీ

Posted On: 25 OCT 2025 3:26PM by PIB Hyderabad

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), గేట్స్ ఫౌండేషన్ సహకారంతో మిషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఇన్ హై-ఇంపాక్ట్ ఏరియాస్ (ఎంఏహెచ్ ఏ) మెడికల్ టెక్నాలజీ (మహా మెడ్ టెక్)ను అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) ప్రారంభించింది. వైద్య సాంకేతిక రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయటానికి, దిగుమతులను తగ్గించటం, అందుబాటు ధరలో, నాణ్యమైన వైద్య సాంకేతికతలను అందరికీ సమానంగా అందేలా చూడటం ఈ మిషన్ లక్ష్యం.

విద్యా సంస్థలు, ఆర్ అండ్ డీ సంస్థలు, ఆస్పత్రులు, స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈలు, మెడ్ టెక్ పరిశ్రమలు, వివిధ సంస్థల సహకారంతో విస్తృత శ్రేణి సంస్థలకు ఈ మిషన్ ఆర్థికంగా చేయూతనిస్తుంది. ప్రాధాన్యతను బట్టి ప్రతి ప్రాజెక్టుకు రూ.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు (అసాధారణ సందర్భాల్లో రూ.50 కోట్ల వరకు) నిధులను అందిస్తుంది. ప్రభావవంతమైన మెడ్ టెక్ పరిష్కారాలను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రాజెక్టులకు ఈ మిషన్ మద్దతిస్తుంది.

కీలక లక్ష్యాలు

·       కీలక వ్యాధులకు పరిష్కారం చూపే, సురక్షితమైన, నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి రావటానికి సహాయపడే సాంకేతికతలను ప్రోత్సహించటం ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించటం.

·       ఖర్చు తగ్గించే పరిష్కారాల ద్వారా సేవలను చౌకగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయటం.

·       దేశీయంగా మెడ్ టెక్ అభివృద్ధి, తయారీ రంగం, పరిశ్రమలు-విద్యా సంస్థల సహకారంతో స్వయం సమృద్ధి, పోటీతత్వాన్ని పెంపొందించటం.

మిషన్ పరిధి

వివిధ నూతన వైద్య పరికరాలు, ఇన్-విట్రో డయాగ్నస్టిక్స్ వంటివి ఈ మిషన్ పరిధిలోకి వస్తాయి. వీటిలో ముఖ్యంగా వైద్య పరికరాలు, కీలక ఉప భాగాలు, ఇంప్లాంట్లు, సహాయ, శస్త్రచికిత్స పరికరాలు, వినియోగ వస్తువులు, సాంకేతిక వైద్య పరికరాలు ఉన్నాయి. అధునాతన రోగ నిర్ధారణ పద్ధతులు, చిన్న శస్త్రచికిత్సలు, పాయింట్ ఆఫ్ కేర్ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్, ఏఐ, ఎంఎల్ ఆధారిత వేదికలు, రోబోటిక్స్, ఇతర నూతన సాంకేతికతలు ఈ మిషన్ పరిధిలో (మరిన్ని కొత్త అంశాలు కూడా) ఉంటాయి. క్షయ, క్యాన్సర్, నవజాత శిశు సంరక్షణ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వంటి జాతీయ ఆరోగ్య ప్రాధాన్యత గల ప్రాజెక్టులను ఈ మిషన్ స్వాగతిస్తుంది.

నిధులతో పాటు పేటెంట్ మిత్ర (ఐపీ ప్రొటెక్షన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్), మెడ్ టెక్ మిత్ర (రెగ్యులేటరీ గైడెన్స్ అండ్ క్లియరెన్సెస్), క్లినికల్ ట్రయల్ నెట్ వర్క్ (ఫర్ క్లినికల్ వాలిడేషన్ అండ్ ఎవిడెన్స్ జనరేషన్), పారిశ్రామిక నిపుణుల నుంచి సలహాలు అందించటం వంటి జాతీయ కార్యక్రమాల ద్వారా అవసరమైన సాయాన్ని ఈ మిషన్ అందిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ, గడువు

ఈ మిషన్ రెండు దశల దరఖాస్తు ప్రక్రియను అనుసరిస్తుంది:

1.       కాన్సెప్ట్ నోట్ లుప్రాజెక్టుల పరిశీలన, ప్రాధాన్యతా క్రమం కోసం సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 7, 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏఎన్ఆర్ఎఫ్ పోర్టల్ www.anrfonline.in  ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

2.       పూర్తి ప్రతిపాదనలుఈ మిషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా షార్ట్ లిస్ట్ అయిన కాన్సెప్ట్ లు మాత్రమే పూర్తి ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలను డిసెంబర్ 2025లో స్వీకరిస్తారు.

మరిన్ని వివరాలకు మహా మెడ్ టెక్ మిషన్ స్కీమ్ పేజీని సంప్రదించవచ్చు https://anrfonline.in/ANRF/maha_medTech?HomePage=New

 

***


(Release ID: 2182554) Visitor Counter : 8