బొగ్గు మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 5.0 కింద గణనీయ విజయాలను నమోదు చేసిన బొగ్గు మంత్రిత్వ శాఖ
Posted On:
24 OCT 2025 3:34PM by PIB Hyderabad
ప్రత్యేక ప్రచారం 5.0లో భాగంగా బొగ్గు మంత్రిత్వ శాఖ, దాని ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) బొగ్గు రంగంలో పరిశుభ్రతను ప్రోత్సహించడం, కార్యాచరణ సామర్థ్యాన్నీ, సుస్థిరతను పెంపొందించడం లక్ష్యంగా పలు కార్యక్రమాలను నిర్వహించాయి.
2025 అక్టోబర్ 2 నుంచి 31 వరకు అమలు చేసే దశలో భాగంగా ఇప్పటికే గణనీయ పురోగతిని సాధించాయి. మొత్తం 1,205 ప్రదేశాలను శుభ్రం చేయడం ద్వారా ఇప్పటికే 68,04,087 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కవర్ చేసి మొత్తం 82,51,511 చదరపు అడుగుల లక్ష్యాన్ని సాధించే దిశగా స్థిరంగా పురోగమిస్తున్నాయి.
|
లక్ష్యంగా నిర్దేశించిన మొత్తం 8,678 మెట్రిక్ టన్నుల స్క్రాప్‌లో 5,813 మెట్రిక్ టన్నుల స్క్రాప్‌ను డిస్పోజ్ చేయడం ద్వారా రూ. 22.87 కోట్ల ఆదాయం లభించింది.
|
|
|
|
|
(ఎన్ఎల్‌సీఐఎల్) కు ముందు
|
(ఎన్ఎల్‌సీఐఎల్) తరువాత
|
|
1,11,248 ఫిజికల్... 30,331 ఎలక్ట్రానిక్ ఫైళ్లను సమీక్షించి వాటి నుంచి 74,123 ఫైళ్లను తొలగించారు/మూసేశారు.
|
|
|
|
|
(సీసీఎల్) కు ముందు
|
(సీసీఎల్) తరువాత
|
ప్రత్యేక ప్రచారం 5.0 సమయంలో అనుసరించిన కొన్ని ఉత్తమ పద్ధతులు కింది విధంగా ఉన్నాయి-
1. 80 ఏళ్ల నాటి భవనం పునరుద్ధరణ
ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లోని బంకోలా ప్రాంతంలో ఉన్న చరిత్రాత్మక "టాలీ బంగ్లా"ను పునరుద్ధరించి... యోగా, వినోద కేంద్రంగా దానిని ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన 80 ఏళ్ల నాటి ఈ నిర్మాణాన్ని దాని నిర్మాణ వారసత్వాన్ని పరిరక్షిస్తూ జాగ్రత్తగా పునరుద్ధరించారు.
2. ప్రత్యేక ప్రచారం 5.0 (ఎన్ఎల్ సీఐఎల్) పై అవగాహన కలిగించే పాట
ఎన్ఎల్‌సీఐఎల్ మైన్ 1A బృందం స్వరపరిచిన ఈ అవగాహన పాటను హిందీ ఉపశీర్షికలతో తమిళంలో రూపొందించారు. ప్రచార ముఖ్య కార్యకలాపాలు, లక్ష్యాలను ఇది సృజనాత్మకంగా హైలైట్ చేస్తుంది.
Watch-
https://www.youtube.com/watch?v=rAUrED9GBC4
3. కాంట్రాక్టు కార్మికుల కోసం వీటీసీ పోర్టల్ (ఎన్‌సీఎల్)
కాంట్రాక్టర్ల ఉద్యోగులకు తగిన శిక్షణ, మూల్యాంకనం, సర్టిఫికేషన్ అందించడం కోసం వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్‌గా సమగ్రమైన, ఎండ్-టు-ఎండ్ డిజిటల్ వృత్తి శిక్షణ నిర్వహణతో కూడిన మొట్టమొదటి వృత్తి శిక్షణ పోర్టల్‌ను నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 30.09.25న ప్రారంభించింది.
ఇప్పటి వరకు 350 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
4. వ్యర్థాల నుంచి సామరస్యం (ఎన్‌సీఎల్)
జయంత్ ఏరియాలో గతంలో స్క్రాప్‌తో నిండి ఉపయోగంలో లేని స్థలాన్ని "ఝంకార్" పేరుతో మ్యూజిక్ రూమ్‌గా మార్చారు. ఈ సృజనాత్మక కార్యక్రమం సాంస్కృతిక వ్యక్తీకరణను... ఉద్యోగులు, వారి కుటుంబాల సమగ్ర శ్రేయస్సునూ ప్రోత్సహిస్తుంది. ఎన్‌సీఎల్ అనుసరిస్తున్న అత్యుత్తమ పద్ధతిగా ఇది నిలుస్తుంది.
కొత్తగా రూపొందించిన మ్యూజిక్ రూమ్ పిల్లల నుంచి మహిళల దాకా... వర్ధమాన అభ్యాసకుల నుంచి అనుభవజ్ఞులైన కళాకారుల దాకా అందరూ సంగీతం పట్ల తమకు గల ప్రేమను అన్వేషించడానికి, నేర్చుకోవడానికి, వ్యక్తీకరించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. వివిధ సంగీత వాయిద్యాలతో అమర్చిన ఈ ప్రదేశం ఉద్యోగులు, వారి కుటుంబాల్లో సృజనాత్మకత, సామాజిక సంబంధాలు, ఆనంద భావాన్ని పెంపొందిస్తుంది.
5. ఎమ్‌వోసీలో కవితలు, ఉపన్యాస పోటీలు
బొగ్గు మంత్రిత్వ శాఖ 22.10.2025న "స్వచ్ఛత", "స్వచ్ఛ భారత్ మిషన్" అనే అంశాలపై కవితలు, ఉపన్యాస పోటీని నిర్వహించింది. క్లీన్ ఇండియా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వినూత్న ఆలోచనలను పంచుకున్న పోటీదారుల నుంచి ఎనిమిది మందిని విజేతలుగా ప్రకటించి, వారి స్ఫూర్తిదాయకమైన కృషికి గానూ వారిని సత్కరించారు.
6. సైబర్ భద్రతపై క్విజ్ పోటీ
బొగ్గు మంత్రిత్వ శాఖ 10.10.2025న సైబర్ భద్రత అంశంపై క్విజ్ పోటీని నిర్వహించింది. సురక్షితమైన, బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తన గురించి అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రచారం 5.0 స్ఫూర్తికి కట్టుబడి బొగ్గు మంత్రిత్వ శాఖ తన కార్యకలాపాలన్నింటిలోనూ స్థిరమైన పరిశుభ్రత, సామర్థ్యం, ఆవిష్కరణలను నిర్ధారిస్తూ ఉంది. మంత్రిత్వ శాఖ, దాని ప్రభుత్వ రంగ సంస్థల సమష్టి ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దార్శనికతకు అనుగుణంగా పరిశుభ్రమైన, సమర్థమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న బొగ్గు రంగాన్ని ప్రోత్సహించాలనే బలమైన సంకల్పాన్ని ప్రతిబింబించాయి.
***
(Release ID: 2182248)
Visitor Counter : 11