పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో తొలిదశ జీవ వైవిధ్య పరిరక్షణ సాధికారతకు రూ.1.36 కోట్లు విడుదల చేసిన జాతీయ జీవ వైవిధ్య సంస్థ

Posted On: 24 OCT 2025 9:00AM by PIB Hyderabad

జీవ వైవిధ్య ప్రయోజనాలను న్యాయంగాసమానంగా పంచటానికి.. పరిరక్షణసుస్థిర వినియోగానికి తన ప్రాధాన్యతను తెలుపుతూజాతీయ జీవ వైవిధ్య సంస్థ (ఎన్ బీఏరూ.1.36 కోట్లను విడుదల చేసిందిఈ నిధులతో వాణిజ్య వినియోగం ద్వారా పొందిన ప్రయోజనాలను మహారాష్ట్రఉత్తరప్రదేశ్ లోని స్థానికులకు అందిస్తుంది.

 

మహారాష్ట్రఉత్తరప్రదేశ్ జీవ వైవిధ్య బోర్డుల ద్వారా ఈ ఆర్థిక సాయాన్ని మూడు జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు.. మహారాష్ట్రలోని సతారా జిల్లాఫల్తాన్ తాలూకాలోని సఖర్వాడి గ్రామంపూణే జిల్లా హవేలీ తాలూకాలోని కుంజిర్వాడి గ్రామంఉత్తరప్రదేశ్ లోని ఎలా జిల్లాకాస్ గంజ్ ప్రాంతానికి అందిస్తారుఆయా ప్రాంతాల్లోని ప్రతి బీఎంసీకి రూ.45.50 లక్షలు అందుతాయిదీని ద్వారా సమానత్వంసుస్థిరతపరిరక్షణకు ప్రభుత్వ ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతుంది.

 

ఒక వాణిజ్య సంస్థ ఫ్రక్టో-ఒలిగోశాకరైడ్స్ ఉత్పత్తులను తయారు చేయడానికి నేలపారిశ్రామిక వ్యర్థ జల నమూనాల నుంచి సేకరించిన సూక్ష్మజీవులను ఉపయోగించినందుకు చెల్లించిన వాస్తవ వనరుల లభ్యతప్రయోజనాల పంపిణీ (ఏబీఎస్చెల్లింపులనువిడుదల చేసిన నిధులు సూచిస్తాయిజీవ వైవిధ్య చట్టం 2002లోని సెక్షన్ 44, సంబంధిత రాష్ట్ర జీవ వైవిధ్య నియమాలలోని కార్యకలాపాలకు ఈ నిధులు ఉపయోగపడతాయి.

 

భారతదేశపు గొప్ప జీవ వైవిధ్య వారసత్వానికి కీలక సంరక్షకులుగా నిలిచే స్థానిక సంఘాలను గుర్తించివాటికి తగిన ప్రయోజనాలను అందించేందుకు ఎన్ బీఏ క్రియాశీలక పాత్రను ఈ ఆర్థిక వ్యూహం స్పష్టం చేస్తుందిజాతీయ జీవ వైవిధ్య సంస్థతో వచ్చిన ప్రయోజనాలను తిరిగి స్థానికులకే అందించటం ద్వారా జీవ వైవిధ్య పరిరక్షణసమాజాభివృద్ధి కలిసి భారత సమగ్ర పాలనా విధానం బలోపేతమవుతుందిఐక్యరాజ్యసమితి జీవ వైవిధ్య సదస్సు (సీబీడీకాప్-15లో ఆమోదించిన కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్ వర్క్ కు అనుగుణంగా నవీకరించిన ఎన్ బీఎస్ఏపీ 2024-2030 జాతీయ జీవ వైవిధ్య లక్ష్యం - 13ని ఇది నెరవేరుస్తుంది.

 

***


(Release ID: 2182113) Visitor Counter : 10