రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ విభాగాల్లో స్వచ్ఛతా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సైనిక వ్యవహారాల విభాగం

Posted On: 22 OCT 2025 4:46PM by PIB Hyderabad

రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు స్పెషల్ క్యాంపెయిన్ 5.0ను నిర్వహిస్తోందిదీనిలో సాయుధ దళాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రక్షణ విభాగాలూ ఉత్సాహంగా పాల్గొంటున్నాయిఈ ప్రచార ఉద్యమంలో మొదటి రెండు వారాల్లోనూ మొత్తం 1,39,484 ఫైళ్లను సమీక్షించి, 1,443 స్థలాలను పరిశుభ్ర పరిచారు. 157 నియమాలను సమీక్షించిసులభతరం చేశారుతుక్కు అమ్మకంతో ఇంతవరకు రూ.10.89 కోట్లు సమకూరాయి.

కిందటి నెలలో సన్నాహక దశను చేపట్టిన సందర్భంగా ప్రచార ఉద్యమానికి సంబంధించిన వివిధ అంశాల్లో ఆచరణసాధ్య లక్ష్యాల్ని నిర్దేశించారుప్రస్తుత అమలు దశలోపని ప్రదేశాల్ని అద్దంలా ఉండేలా తీర్చిదిద్దడంవినియోగిస్తున్న ప్రదేశాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడంతుక్కును వదిలించుకోవడంపాత రికార్డులను ఏరివేయడంతో పాటు ఖాళీ ప్రదేశాలను సుందరీకరించడంపైనా శ్రద్ధ తీసుకుంటున్నారు.

ప్రజా ఫిర్యాదులుప్రధానమంత్రి కార్యాలయంపార్లమెంటు సభ్యులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని సూచించిన లేఖల్లో అపరిష్కృత వ్యవహారాలను క్రమంగా పరిష్కరించడమే కాకుండా విన్నపాలనూపార్లమెంటులో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై కూడా ఈ ప్రచార ఉద్యమంలో ప్రత్యేకంగా దృష్టిని సారిస్తున్నారు.

నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేలాప్రచార ఉద్యమ పురోగతి తీరును నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

 

***


(Release ID: 2181614) Visitor Counter : 10