పర్యటక మంత్రిత్వ శాఖ
పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడానికి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు.. ప్రత్యేక ప్రచారం 5.0
प्रविष्टि तिथि:
21 OCT 2025 1:48PM by PIB Hyderabad
పెండింగ్‌లో ఉన్న అంశాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రచారం (ఎస్‌సీడీపీఎం) 5.0ను పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పర్యాటక కార్యాలయాలు, హోటల్ మేనేజ్మెంట్ విద్యా సంస్థ (ఐహెచ్ఎం)లు, భారత పర్యాటక, ప్రయాణ నిర్వహణ సంస్థ (ఐఐటీటీఎం), భారత పర్యాటక అభివృద్ధి సంస్థ (ఐటీడీసీ), కార్యక్రమ విభాగాలు చురుగ్గా పాల్గొంటున్నాయి.
ఈ ప్రత్యేక ప్రచారం 5.0 కోసం మొత్తం 6429 లక్ష్యాలను గుర్తించి వాటిని ఎస్‌సీడీపీఎం పోర్టల్లో పర్యాటక మంత్రిత్వ శాఖ ఉంచింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా మొత్తం 413 ప్రాంతాలను పరిశుభ్రం చేయడానికి గుర్తించారు. అలాగే 4700 ఫైళ్లను, 1,100 ఈ-ఆఫీసు ఫైళ్లను సమీక్షించేందుకు గుర్తించారు.
ఇప్పటి వరకు 1553 కార్యకలాపాలను అమలు చేసి నిర్దేశిత లక్ష్యాల్లో 24.15 శాతం పూర్తి చేశారు. 14,095 చదరపు గజాల స్థలం ఖాళీ అయింది. వ్యర్థాలను తొలగించడం ద్వారా రూ. 172991 ఆదాయం సమకూరింది. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదులు (డీఏఆర్పీజీ) నిర్వహిస్తున్న ఎస్‌సీడీపీఎం పోర్టల్లో ప్రగతిని పర్యవేక్షించి సమాచారాన్ని పోర్టల్లో ఉంచుతున్నారు.
***
(रिलीज़ आईडी: 2181399)
आगंतुक पटल : 26