లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన లోక్‌సభ స్పీకర్

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2025 7:11PM by PIB Hyderabad

దీపావళి సందర్భంగా ప్రజలకు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ బిర్లా ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:

‘‘వెలుగుల మహా పండుగ రోజు దీపావళి సందర్బంగా అందరికీ నేను మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. త్వరలో రాబోతున్న గోవర్ధన్ పూజ, భాయి దూజ్‌ పండుగలను కూడా దృష్టిలో పెట్టుకొని నా హృదయపూర్వక శుభకామనలు అందజేస్తున్నా.

దీపావళి పర్వదినం మన సంస్కృతీ సంప్రదాయాలకు కీలకంగా నిలుస్తోంది. ఇది దీపాలను వెలిగించి పండుగ చేసుకోవడం ఒక్కటే కాదు.. ఇది చీకటిపై వెలుగు, అజ్ఞ‌ానంపై జ్ఞ‌ానం, నిరాశపై ఆశ గెలిచిన సందేశాన్నిచ్చే పండుగ.


విలువలు, మర్యాద, ధర్మం.. ఈ బాటలో శ్రీ రామ ప్రభువు నడిచి స్థాపించిన ఆదర్శాలు.. మనం కూడా మన జీవనంలో సత్యాన్నీ, కర్తవ్యాన్నీ, సద్భావననూ కాపాడాలని మనకు ప్రేరణనిస్తున్నాయి. దీపావళి అంటే వేడుకలు చేసుకోవడం ఒక్కటే కాదు, ఆ ప్రసన్నత నిండిన వాతావరణాన్ని ఇతరులకు కూడా కలగజేయాలని సూచిస్తుంది. ఇతరుల జీవనంలోనూ వెలుగులు నింపేందుకు మనం ప్రయత్నించాలి.  

సమాజంలో ఏకతనూ, సోదర భావాన్నీ, ఒకరిపట్ల మరొకరు విశ్వాసంతో ఉండడాన్నీ, మనమంతా ఒక్కటేననే సమానత్వ భావననూ బలపరుచుకొంటామని ఈ పవిత్ర పర్వదినాన ప్రతిజ్ఞ‌ చేద్దాం. మన రైతులూ, కార్మికులూ శక్తిమంతులవ్వాలనీ, మన వాణిజ్య వర్గాలు పురోగమించాలనీ, మన యువత ఉత్సాహవంతులై వారి కాళ్ల మీద వారు నిలబడాలనీ, మన దేశం అభివృద్ధి బాటలో మరింత ముందుకు పయనించాలనీ నేను కోరుకుంటున్నాను.

లక్ష్మీ అమ్మవారు మీ అందరి జీవనంలో సుఖ సమృద్ధులను అనుగ్రహించాలనీ, సరస్వతీ అమ్మవారు విద్యనూ, జ్ఞ‌ానాన్నీ తన ఆశీస్సులుగా మీకు అందజేయాలనీ, గణేశ భగవానుడు అన్ని విఘ్నాలనూ తొలగించి మీ సంక్షేమానికి బాట వేయాలనీ నేను అభిలషిస్తున్నాను.

మీకందరికీ దీపావళి శుభాకాంక్షలు.

జై సియారామ్.’’

 
***

(రిలీజ్ ఐడి: 2181046) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil , Malayalam