రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత ఆర్మీ 7.62x51mm అస్సాల్ట్ రైఫిల్స్ కోసం అధునాతన నైట్ సైట్ల కొనుగోలుకు రూ.659.47 కోట్ల ఒప్పందంపై సంతకం చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2025 5:54PM by PIB Hyderabad

భారత ఆర్మీ 7.62x51mm అస్సాల్ట్ రైఫిల్స్ కోసం అధునాతన నైట్ సైట్లు (ఇమేజ్ ఇంటెన్సిఫైయర్), దానికి సంబంధించిన పరికరాల కొనుగోలుకు  ఎంకేయూ సంస్థ (ప్రధాన భాగస్వామి), మెడ్ బిట్ టెక్నాలజీస్ సంస్థతో కలిసి రూ.659.47 కోట్ల విలువైన కాట్రాక్ట్ ఒప్పందంపై అక్టోబర్ 15, 2025న రక్షణ మంత్రిత్వ శాఖ సంతకం చేసిందిఈ నైట్ సైట్ వల్ల ఎస్ఐజీ 716 అస్సాల్ట్ రైఫిల్ కు ఉన్న సుదూర లక్ష్యాన్ని ఛేదించగలిగే సామర్థ్యాన్ని సైనికులు పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతారు.

నక్షత్రాల వెలుగులోనూ 500 మీటర్ల పరిధి వరకున్న లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగల సామర్థ్యం ఈ సైట్లకు ఉండటమే కాకప్రస్తుతం వాడుకలో ఉన్న పాసివ్ నైట్ సైట్ల (పీఎన్ఎస్కంటే మెరుగైనవి. 51% కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో బై (ఇండియన్-ఐడీడీఎంద్వారా వర్గీకరించిన ఈ కొనుగోలురక్షణ రంగ తయారీలో ఆత్మనిర్భరత దిశగా కీలక ముందడుగా చెప్పవచ్చుదీని ద్వారా విడిభాగాల తయారీముడి సరుకు సరఫరాలో పాలుపంచుకున్న ఎంఎస్ఎంఈలకు కూడా ప్రయోజనం కలుగుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2179944) సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Malayalam