రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

బ్రెజిల్ ఉపాధ్యక్షులు, రక్షణ మంత్రితో న్యూఢిల్లీలో సమావేశమైన రక్షణ మంత్రి

प्रविष्टि तिथि: 15 OCT 2025 8:31PM by PIB Hyderabad

2025, అక్టోబర్ 15న బ్రెజిల్ ఉపాధ్యక్షులు శ్రీ గెరాల్డో అల్కమిన్‌తో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ భేటీ అయ్యారుఈ సమావేశంలో బ్రెజిల్ రక్షణ మంత్రి శ్రీ జోస్ మ్యూషియో మోంటేయిరో ఫిల్హో కూడా పాల్గొన్నారు.

 

ప్రస్తుతం కొనసాగుతున్న రక్షణ సంబంధిత కార్యకలాపాల్లో సాధించిన పురోగతిని నాయకులు సమీక్షించారుఅలాగే రక్షణ సామగ్రిని ఉమ్మడిగా అభివృద్ధిఉత్పత్తి చేసే దిశగా అవకాశాలను అన్వేషించడంతో సహా కలసి పనిచేసేందుకు ప్రాధాన్యతా రంగాలను గుర్తించారు.

 

 

భారత్బ్రెజిల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందిసంయుక్త విన్యాసాలుశిక్షణా పర్యటనలతో సహా సైన్యానికి సంబంధించిన అంశాల్లో పరస్పర సహకారంపై దృష్టి సారించి రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ ఉమ్మడి నిబద్ధతను నాయకులు పునరుద్ఘాటించారు.

 

***


(रिलीज़ आईडी: 2179943) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Malayalam