రక్షణ మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలో ఇండోనేషియా నావికాదళంతో కలిసి ద్వైపాక్షిక విన్యాసాల ఐదో ప్రదర్శన 'సముద్ర శక్తి' - 2025ని నిర్వహిస్తున్న భారత నేవీ
प्रविष्टि तिथि:
15 OCT 2025 2:04PM by PIB Hyderabad
భారత్-ఇండోనేషియా సంయుక్త ద్వైపాక్షిక సముద్ర విన్యాసాల ఐదో ప్రదర్శన 'సముద్ర శక్తి - 2025'ని విశాఖపట్నంలో అక్టోబర్ 14 నుంచి 17 వరకు భారత నౌకాదళం నిర్వహిస్తోంది. ఈ విన్యాసంలో తూర్పు నౌకాదళ కమాండ్ (ఈఎన్ సీ) ఆధ్వర్యంలోని తూర్పు ఫ్లీట్ కు చెందిన యాంటీ-సబ్ మెరైన్ వార్ ఫేర్ ఐఎన్ఎస్ కవరత్తి, ఇండోనేషియా నౌకాదళ యుద్ధ నౌక (అనుబంధంగా ఒక హెలికాప్టర్ సహా) కేఆర్ఐ జాన్ లీ ఉన్నాయి. ఈఎన్ సీ తరపున కేఆర్ఐ జాన్ లీకి విశాఖపట్నంలో ఘన స్వాగతం లభించింది.
నౌకాదళాల మధ్య స్వేహపూర్వక వాతావరణాన్ని, వృత్తిపరమైన సంబంధాన్ని పెంపొందించే లక్ష్యంతో నౌకలను పరస్పరం సందర్శించటం, సంయుక్త యోగా సెషన్లు, స్నేహపూర్వక క్రీడా పోటీలు, ప్రొఫెషనల్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్ పర్ట్ ఎక్స్ఛేంజెస్ (ఎస్ఎంఈఈ) వంటి కార్యక్రమాలను నౌకాశ్రయాల వద్ద నిర్వహిస్తారు. వ్యూహాత్మక సమన్వయాన్ని పెంచే లక్ష్యంతో నిర్వహించే డైనమిక్, సంక్లిష్ట సముద్ర కార్యకలాపాల్లో భాగంగా హెలికాప్టర్ విన్యాసాలు, వాయు రక్షణ విన్యాసాలు, ఆయుధ కాల్పుల డ్రిల్స్, సందర్శన, నౌకలోకి ప్రవేశం, అన్వేషించటం, స్వాధీనం చేసుకోవటం (వీబీఎస్ఎస్ ) వంటివి సముద్రంలో జరుగుతాయి.
రెండు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచటానికి, పరస్పర అవగాహనను బలోపేతం చేసేందుకు, అత్యుత్తమ విధానాలను పంచుకోవటానికి ఉద్దేశించిన ద్వైపాక్షిక కార్యక్రమమే 'సముద్ర శక్తి' విన్యాసం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, శాంతిని కాపాడాలన్న రెండు దేశాల ఉమ్మడి ప్రాధాన్యతను ఈ విన్యాసం స్పష్టం చేస్తుంది.
(9)10CV.jpeg)
(9)SB6B.jpeg)
(6)DG0F.jpeg)
***
(रिलीज़ आईडी: 2179672)
आगंतुक पटल : 40