హోం మంత్రిత్వ శాఖ
2030 కామన్వెల్త్ క్రీడలను అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు కామన్వెల్త్ అసోసియేషన్ ఆమోదం తెలపడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
ప్రపంచ క్రీడా చిత్రంలో భారత్ సమున్నత స్థానం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన అవిశ్రాంత కృషికి ఫలితం
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడం, దేశవ్యాప్తంగా క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా
దేశాన్ని క్రీడల గమ్యస్థానంగా మార్చిన ప్రధానమంత్రి శ్రీ మోదీ
Posted On:
15 OCT 2025 8:06PM by PIB Hyderabad
2030 కామన్వెల్త్ క్రీడలను అహ్మదాబాద్‌లో నిర్వహించాలన్న భారత బిడ్‌కు కామన్వెల్త్ అసోసియేషన్ ఆమోదం తెలపడం పట్ల కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు.
‘ఎక్స్’ వేదికగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు: “భారతదేశానికి ఇది చాలా సంతోషకరమైన, గర్వకారణమైన రోజు. 2030 కామన్వెల్త్ క్రీడలను అహ్మదాబాద్‌లో నిర్వహించాలనే భారత బిడ్‌ను కామన్వెల్త్ అసోసియేషన్ ఆమోదించిన సందర్భంలో దేశంలోని ప్రతి పౌరుడికి హృదయపూర్వక అభినందనలు. ప్రపంచ క్రీడా చిత్రంలో సమున్నత స్థానంలో భారత్‌ను నిలిపేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అవిశ్రాంత కృషికి తగిన ఫలితం లభించింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడం, దేశవ్యాప్తంగా క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశాన్ని క్రీడలకు గమ్యస్థానంగా మార్చారు.”
***
(Release ID: 2179655)
Visitor Counter : 6