ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

Posted On: 15 OCT 2025 9:00AM by PIB Hyderabad

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

డాక్టర్ కలాంను ఒక దార్శనికునిగా స్మరించుకొంటామనీ, ఆయన యువత మనసును జాగృతం చేశారనీ, పెద్ద పెద్ద కలలను కనండంటూ దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలించారనీ శ్రీ మోదీ అన్నారు. విజయాన్ని అందుకోవాలంటే కష్టపడి  పనిచేయడం, వినయంతో నడుచుకోవడం అత్యవసరమని డాక్టర్ కలామ్ జీవనం మనకు గుర్తుచేస్తుంది అని కూడా శ్రీ మోదీ అన్నారు.

డాక్టర్ కలామ్ కలలు కన్నట్టుగానే భారత్‌ను శక్తిమంతమైందిగాను, స్వయంసమృద్ధి కలిగిందిగాను, కారుణ్యభరితమైందిగాను తీర్చిదిద్దే దిశగా మనం కృషి చేస్తామన్న ఆశను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.

‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ జీని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకొంటున్నాం.  ఒక దార్శనికునిగా ఆయనను స్మరించుకొంటూ ఉంటాం. యువత మనసును ఆయన జాగృతం చేయడంతో పాటు పెద్ద పెద్ద కలలను కనండంటూ దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలించారు. విజయాన్ని సాధించాలంటే కష్టపడి  పనిచేయడం, వినయంతో నడుచుకోవడం అతి ముఖ్యమని మనకు ఆయన జీవనం గుర్తుచేస్తుంది. ఆయన కలలు గన్న విధంగా బలమైన, ఆత్మనిర్భరత కలిగిన, కరుణాభరిత భారత్‌ను ఆవిష్కరించే దిశగా మనం మన కృషిని కొనసాగించుదాం.’’
 
https://x.com/narendramodi/status/1978291330418622968?s=46
 
***

(Release ID: 2179276) Visitor Counter : 7