రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సిడ్నీలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా డిఫెన్స్ ఇండస్ట్రీ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన రక్షణ మంత్రి


సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 2020 ద్వారా సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ కు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తూ రక్షణ బంధాలను మెరుగుపరచటానికి కీలక స్థానంలో ఉన్నాం: రక్షణ మంత్రి

తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో భారత్ నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టింది. ప్రస్తుతం, భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నింటిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా నిలిచింది: రక్షణ మంత్రి

"రక్షణ రంగ ఆర్ అండ్ డీని ప్రైవేట్ రంగంలో వేగవంతం చేయటానికి, డీఆర్ డీఓ ద్వారా ఉచిత సాంకేతికత బదిలీ మార్గాలను ఏర్పాటు చేశాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటానికి ఆకర్షణీయమైన పథకాలున్నాయి. అవి అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి"

ప్రొపల్షన్ టెక్నాలజీలు, స్వయంప్రతిపత్తి జలంతర్గాములు, ఫ్లైట్ సిమ్యులేటర్లు, అధునాతన వస్తువుల వంటి అత్యున్నత స్థాయి వ్యవస్థలను అభివృద్ధి చేయటానికి, ఉత్పత్తి చేయటానికి ఆస్ట్రేలియాను స్వాగతించిన రక్షణ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 10 OCT 2025 10:15AM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 10, 2025న సిడ్నీలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా డిఫెన్స్ ఇండస్ట్రీ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ వ్యూహాత్మకపారిశ్రామికసాంకేతిక రంగాల్లో రెండు దేశాల మధ్య పెరుగుతున్న సమన్వయాన్ని తెలిపారు. “సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 2020 ద్వారా రక్షణ బంధాలను బలోపేతం చేసేందుకు కీలక దశలో ఉన్నాంఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతఅభివృద్ధికి కేవలం భాగస్వాములుగా కాకసహనిర్మాతలుగా మారాల్సిన అవసరం ఉందిఅని రక్షణ మంత్రి అన్నారుఈ రౌండ్‌ టేబుల్ సమావేశం కేవలం చర్చ మాత్రమే కాదని.. వాణిజ్యంపారిశ్రామిక రంగంఆవిష్కరణల్లో భారత్ఆస్ట్రేలియాలను సహజ మిత్రులుగా మార్చాలనే సంకల్ప ప్రకటన అని స్పష్టం చేశారు.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి జరిగిన ఉన్నత-స్థాయి సమావేశాలను శ్రీ రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారువాటిలో నవంబర్ 2024లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా సదస్సుఅక్టోబర్ 2024లో జరిగిన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలుజూన్ 2025లో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రిరక్షణ మంత్రి భారత్ పర్యటనప్రస్తుతం ఆస్ట్రేలియాలో రాజ్ నాథ్ పర్యటన ఉన్నాయిఉమ్మడి ప్రజాస్వామ్య విలువలువ్యవస్థాపక సారూప్యతలు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు మూలమని రక్షణ మంత్రి స్పష్టం చెప్పారు. "భారత్-ఆస్ట్రేలియా రెండూ కామన్‌వెల్త్ ఆఫ్ నేషన్స్‌లో భాగమేప్రజాస్వామ్యంవైవిధ్యంస్వేచ్ఛాఒకే రకమైన పాలనా విధానాలపై మన ఉమ్మడి చరిత్ర నిర్మితమైందిఅని ఆయన అన్నారు.

మూడు కీలక అంశాలపై ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉన్నాయని రక్షణ మంత్రి అన్నారుఅవి భవిష్యత్ ప్రయోజనాల కోసం గవర్నమెంట్-టు-గవర్నమెంట్ సహకారంపీపుల్-టు-పీపుల్ అనుబంధంఉమ్మడి వ్యాపార ప్రయోజనాలు. "ఇప్పటికే బలంగా ఉన్న మన ప్రభుత్వ విధానాలు మరింత బలోపేతమవుతున్నాయిఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులుండగాభారత్ లోనూ ఆస్ట్రేలియన్ల సంఖ్య పెరుగుతోందిసంయుక్త పరిశోధనఅభివృద్ధిఆవిష్కరణఉమ్మడి రూపకల్పనఉత్పత్తిపై ఆధారపడిన మన రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యంలో వినియోగించుకోవాల్సిన సామర్థ్యం ఎంతో ఉందిఅని చెప్పారు.

భారత్ ఇటీవల సాధించిన ఆర్థికపారిశ్రామిక విజయాలను ప్రస్తావిస్తూముఖ్యంగా ఉత్పత్తి రంగంలో మార్పులు తెచ్చేలా నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టినట్లు శ్రీ రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. “ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగాఅత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందిగత ఆర్థిక సంవత్సరంలో మన రక్షణ ఉత్పత్తి విలువ రూ.1.51 లక్షల కోట్లకు (సుమారు 18 బిలియన్ డాలర్లుచేరుకోగా.. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 18% అధికంమన రక్షణ ఎగుమతులు రూ. 23,622 కోట్లకు (2.76 బిలియన్ డాలర్లుచేరుకున్నాయిప్రస్తుతం భారత కంపెనీలు సుమారు 100 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి” అని ఆయన వెల్లడించారు.

స్నేహపూర్వక పారిశ్రామిక సహకారాన్ని కోరుతూ.. “వాణిజ్యంపారిశ్రామిక రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా సహజ మిత్ర దేశాలుగా మారటానికి ముఖ్య సాధనంగా ఈ వేదిక ఉంటుందని భావిస్తున్నాఈ కూటమి విజయానికిపరస్పర ప్రయోజనానికి బలమైన ఆర్థిక కారణాలున్నాయిఅని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

క్వాంటం వ్యవస్థలుస్వయంప్రతిపత్తి జలాంతర్గామి వాహనాలుఅధునాతన సముద్ర నిఘా వంటి ప్రత్యేక సాంకేతికతలతో ఆస్ట్రేలియా దూసుకెళ్తుండగా.. విస్తృతమైన తయారీ సామర్థ్యంసాఫ్ట్‌వేర్ నైపుణ్యాలునౌకా నిర్మాణంక్షిపణి సాంకేతికతఅంతరిక్షంలో దేశీయ బలాన్ని భారత్ ప్రదర్శిస్తుంది. "రక్షణ రంగ సహకారంలో వినియోగించుకోని సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉత్ప్రేరకంగా పనిచేస్తుందిఅని ఆయన చెప్పారు.

మేక్ ఇన్ ఇండియాప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్డిజిటల్ పరివర్తన వంటి కార్యక్రమాలు ఆవిష్కరణలకుపెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారుసరళీకరించిన ఎఫ్ డీఐ విధానం ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా 74% వరకుఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టినప్పుడు అంతకంటే ఎక్కువ శాతం పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వ ఆమోదం పొందాలని రక్షణ మంత్రి తెలిపారువిధానపరమైన చర్యలునిబంధనల అమలును సులభతరం చేయటం ద్వారా రక్షణ ఉత్పత్తి వ్యవస్థను నిరంతరం సరళంగా మారుస్తున్నామని చెప్పారు.

"ప్రైవేట్ రంగంలో రక్షణ ఆర్ అండ్ డీని వేగవంతం చేయటానికిడీఆర్ డీఓ ద్వారా సాంకేతికతను ఉచితంగా బదిలీ చేయటానికి మేం అవకాశమిచ్చాంఅత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ఆకర్షణీయమైన పథకాలు ఉన్నాయిఅవి అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయిఅని పరిశోధనఆవిష్కరణల ప్రోత్సాహానికి తీసుకున్న చర్యల గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారుడీఆర్ డీఓఆస్ట్రేలియా డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ ఇప్పటికే టోవ్డ్ అరే సెన్సార్లపై కలిసి పనిచేస్తున్నాయనిక్వాంటం సాంకేతికతఏఐసైబర్ భద్రతసమాచార యుద్ధంఅధునాతన సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై చర్చలు ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు.

ప్రొపల్షన్ టెక్నాలజీలుస్వయంప్రతిపత్తి జలాంతర్గామి వాహనాలుఫ్లైట్ సిమ్యులేటర్లు అధునాతన వస్తువులు వంటి అత్యున్నత స్థాయి వ్యవస్థలను అభివృద్ధి చేయటానికిఉత్పత్తి చేయటానికి ఆస్ట్రేలియా కంపెనీలను భారత్ స్వాగతిస్తోందని రక్షణ మంత్రి చెప్పారురెండు దేశాల వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయగలిగే వేదికలను నిర్మించటానికి ఈ ప్రయత్నాలు సహాయపడతాయని ఆయన స్పష్టం చేశారు.

భాగస్వామ్యం కోసం నిర్దిష్ట రంగాల గురించి ప్రస్తావిస్తూపటిష్టమైన నౌకా నిర్మాణ సామర్థ్యాలువిభిన్న తయారీ స్థావరంప్రైవేట్ రంగంలో పెరుగుతున్న ఆవిష్కర్తలుస్టార్టప్‌ల వ్యవస్థతో విశ్వసనీయ భాగస్వామిగా ఉండేందుకు భారత్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి అన్నారు. "విస్తృతమైన నౌకాదళ వేదికలను నిర్మించటంనిర్వహించటంలో మా నౌకా నిర్మాణ కేంద్రాలకు ట్రాక్ రికార్డ్ ఉందిరాయల్ ఆస్ట్రేలియన్ నేవీకిఆస్ట్రేలియా పసిఫిక్ మారిటైమ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద ఉన్న నౌకలకు మరమ్మతులుసామర్థ్యాన్ని పెంచే మార్పులునిర్వహణ సేవలను భారత నౌకా నిర్మాణ కేంద్రాలు అందించగలవుఅని తెలిపారు.

ఇండో-ఎంఐఎం ప్రైవేట్ లిమిటెడ్థేల్స్ ఆస్ట్రేలియాటాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ విత్ డబ్ల్యూ అండ్ ఈ ప్లాట్ ప్రైవేట్ లిమిటెడ్మునిషన్స్ ఇండియా లిమిటెడ్ఆక్వ్‌స్పోర్ట్ వంటి సంస్థల మధ్య మెరుగైన పారిశ్రామిక భాగస్వామ్యాల ఉదాహరణలను రక్షణ మంత్రి తెలిపారు. "మన పారిశ్రామిక వ్యవస్థల పరస్పర సహకారాన్నిప్రభుత్వాల వ్యూహాత్మక లక్ష్యం వెనుక వాణిజ్యం ప్రధాన శక్తిగా మారటాన్ని ఈ ఉదాహరణలు చూపిస్తాయిఅని అన్నారుభవిష్యత్తులో ఈ జాబితా మరింత పెరుగుతుందనితద్వారా ప్రస్తుత సామర్థ్యం నుంచి ఇరుపక్షాలు పూర్తి ప్రయోజనం పొందవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రక్షణ సంబంధిత ఉత్పత్తులుసేవల సరఫరాకు సంబంధించి ఆస్ట్రేలియా చేసిన ఎంఓయూ ప్రతిపాదనను శ్రీ రాజ్ నాథ్ సింగ్ స్వాగతించారు. "ఈ ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాంముఖ్యంగాసాంకేతికతను సులభంగా పంచుకోవటానికి వీలుగా కొన్ని అడ్డంకులను తొలగించిభారతదేశాన్ని ఒక అగ్రశ్రేణి భాగస్వామిగా ఆస్ట్రేలియా గుర్తించిందిఇది భారత్ తో బంధంపై ఉంచిన విశ్వాసానికినమ్మకానికి నిదర్శనంఅని అన్నారు.

రెండు దేశాల ముందున్న విస్తృతమైన అవకాశాలున్నాయని రక్షణ మంత్రి అన్నారు. "ఆస్ట్రేలియాభాగస్వామ్య దేశాల నౌకల కోసం భారత్ లో నౌకలుఉప-వ్యవస్థలునౌకల మరమ్మతులుపునరుద్ధరణ ఎంఆర్‌ఓ సహాయం కోసం సహ ఉత్పత్తికిస్వయంప్రతిపత్తి వ్యవస్థలుగ్రీన్ షిప్‌బిల్డింగ్ సాంకేతికల్లో ఉమ్మడి పరిశోధనఅభివృద్ధి కోసం అపారమైన అవకాశాలున్నాయిఅని తెలిపారువైవిధ్యమైన సరఫరా వ్యవస్థలుఉమ్మడి సామర్థ్యాలను మెరుగుపరచటంఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రెండు దేశాలు పటిష్టమైనసురక్షితమైనస్వావలంబన గల ఇండో-పసిఫిక్ కి తోడ్పడగలవని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

"భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకుసహకారానికిఆవిష్కరణలు చేసేందుకు ఆస్ట్రేలియాను ఆహ్వానిస్తున్నానుమనం అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయటమే కాకఆధునిక వేదికలను ఏర్పాటు చేయవచ్చుమన పరిశ్రమలు కేవలం సరఫరాదారులుగానే కాకుండాశాంతిభద్రతలకు వ్యూహాత్మక సహాయకారులుగా ఉండవచ్చుఅని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారుఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండావ్యూహాత్మక పరివర్తన దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

భారత్-ఆస్ట్రేలియా రక్షణ భాగస్వామ్యం ఒక కీలకమైన స్థానంలో ఉందనివ్యూహాత్మక లక్ష్యాల సమ్మేళనంపారిశ్రామిక రంగ శక్తినాయకత్వాల దార్శనికతతో భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఇరు దేశాలకు ఇదొక ప్రత్యేకమైన అవకాశమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ అన్నారు.

రక్షణ మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం), ఆస్ట్రేలియా రక్షణ విభాగంన్యూల్యాండ్ గ్లోబల్ గ్రూప్ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ రౌండ్ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించాయిఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ పీటర్ ఖలీల్‌తో పాటురెండు దేశాల సీనియర్ ప్రభుత్వాధికారులుదౌత్యవేత్తలుపారిశ్రామిక రంగ ప్రముఖులుపరిశోధనా సంస్థలుఆవిష్కర్తలు హాజరయ్యారు.

 

***


(రిలీజ్ ఐడి: 2177560) సందర్శకుల సూచీ సంఖ్య : : 36
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam