వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముంబయిలో భారత్, యూకే వాణిజ్య మంత్రుల ద్వైపాక్షిక సమావేశం


లక్ష్యం: ఇండియా-యూకే జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ దార్శనికతకు రూపమివ్వడం,

భారత్, యూకే సీఈటీఏ ప్రయోజనాలను అందించడం, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతం

प्रविष्टि तिथि: 08 OCT 2025 6:57PM by PIB Hyderabad

వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో భారత్యునైటెడ్ కింగ్‌డమ్ భాగస్వామ్యానికి ఒక కొత్త రూపురేఖలను సిద్ధం చేసే ఉద్దేశంతో ఒక  ద్వైపాక్షిక సమావేశాన్ని ముంబయిలో ఈ రోజు నిర్వహించారుఈ సమావేశంలో కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్యూకే వాణిజ్య మంత్రి శ్రీ పీటర్ కైల్ పాల్గొన్నారు.

భారత్యూకేల మధ్య సమగ్ర ఆర్థికవాణిజ్య ఒప్పందం (సీఈటీఏఅమలును పర్యవేక్షించడానికి జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీని (జేఈటీసీఓపటిష్ఠం చేయాలని మంత్రులిద్దరూ ఈ సమావేశంలో అంగీకరించారుదీంతో ఒప్పందం అమలు దిశగా ఒక ముఖ్యమైన అడుగును వేసినట్లయింది.
ఒప్పందాన్ని త్వరగానుసమన్వయంతోనుఆశిస్తున్న ఫలితాలను సాధించేదిగా మలచడానికి ఇరు పక్షాలు నిబద్ధతను వ్యక్తపరిచాయిరెండు దేశాల వాణిజ్య సంస్థలతో పాటు వినియోగదారులు కూడా ఈ ఒప్పంద ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకోగలగాలన్నదే దీని ఉద్దేశం.

అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్డిజిటల్ వాణిజ్యంస్వచ్ఛ ఇంధనంసేవలు వంటి రంగాల్లో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకున్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా, 2030 కల్లా ఉభయ దేశాల మధ్య వాణిజ్య స్థాయిని రెట్టింపు చేసుకోవాలన్న ఉమ్మడి ఆకాంక్షను మంత్రులు పునరుద్ఘాటించారు.

సీఈటీఏతో భారీ మార్పు చోటుచేసుకొనే అవకాశం ఉందని మంత్రులు స్పష్టం చేశారునియంత్రణ రంగంలో సహకారంటారిఫేతర సమస్యలను పరిష్కరించడంసరఫరా వ్యవస్థను ఏకీకరించడంపై శ్రద్ధ తీసుకోవడం వంటి చర్యలతో ఒప్పందం తాలూకు లాభాలను సాధ్యమైనంత అధికంగా ఎలా పొందవచ్చనే అంశంపై వారు చర్చించారు.

వాణిజ్య మంత్రిడైరెక్టర్ జనరల్ స్థాయిలో జరిగిన ఈ సమావేశం.. మంత్రుల స్థాయి సమావేశానికి ప్రాధాన్యతను తెచ్చింది.

రోజంతా సాగే ఆసక్తిదాయక చర్చలకూ, దూరదృష్టితో కూడిన చర్చలకూ ఈ సమావేశం బలమైన పునాదిని వేసింది.

ద్వైపాక్షిక సమావేశాని కన్నా ముందుఅడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్వినియోగదారు వస్తువులుఆహారంపానీయాలువిజ్ఞానశాస్త్రంసాంకేతిక విజ్ఞానంనవకల్పననిర్మాణంమౌలిక సదుపాయాల కల్పనస్వచ్ఛ ఇంధనంఆర్థికవృత్తినైపుణ్యవాణిజ్య సేవలు (వీటిలో ఐటీఐటీఈఎస్విద్యఇంజినీరింగ్ కూడా భాగంసహా ప్రాధాన్య రంగాల్లో అనేక రంగాలవారీ రౌండ్‌టేబుల్ సమావేశాలను కూడా నిర్వహించారుఈ చర్చలు భారత్యూకేల పరిశ్రమ రంగ ప్రముఖులకు ఒక వేదికను సమకూర్చడంతో పాటుకార్యాచరణకు మార్గదర్శనాన్ని అందించే లోతైనఎంతో విలువైన ఆలోచనలనూ అందించాయి.

భారత్-యూకే సీఈఓ ఫోరాన్ని కూడా ఈ  సందర్భంగా ఏర్పాటు చేశారుదీనిలో రెండు దేశాలకు చెందిన వాణిజ్య రంగ  ప్రముఖులు వాణిజ్యంపెట్టుబడినవకల్పనలకు కొత్త  అవకాశాలను చర్చించేందుకు ముందుకు వచ్చారుఇండియా-యూకే దేశాలకు చెందిన పరిశ్రమ రంగ ప్రతినిధుల సహాధ్యక్షతన ఏర్పాటైన ఈ ఫోరమ్.. రెండు పక్షాల ఆర్థిక సహకారాన్ని ఇప్పటితో పోలిస్తే మరింతగా పెంచేందుకూవిభిన్నరంగాల్లో భాగస్వామ్యాన్ని బలపరిచేందుకూ ఒక ముఖ్య వేదికలా పనిచేసిందిభారత్యూకే ల మధ్య ఆధునికపరస్పర ప్రయోజనకరమన్నిక కలిగిన ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కలిసి పనిచేయాలన్న నిబద్ధతను ఈ చర్చలు పునరుద్ఘాటించాయిఈ దిశగా ఇండియా-యూకే సీఈటీఏ ఇప్పటికే తన వంతుగా తోడ్పడింది.

ప్రపంచ దేశాల వ్యాపారఆర్థిక దృక్పథంపై మంత్రులిద్దరూ తమ ఆలోచనలను పంచుకున్నారుప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత స్థితులు చోటుచేసుకుంటున్నందువల్ల ఆటుపోటులకు తట్టుకొని నిలిచేవిభిన్న సరఫరా వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారుప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఒక కీలక అభివృద్ధి ఇంజినుగా మారిందని శ్రీ గోయల్ వ్యాఖ్యానించారుభారత్‌తో యూకే కుదుర్చుకున్న ఒప్పందం ఇంతవరకు కుదిరిన ఒప్పందాలన్నింటి కన్నా మంచిదని మంత్రి శ్రీ కైల్ స్పష్టం చేశారుఈ ఒప్పందం భారతదేశంలోని విశాల మార్కెట్టును బ్రిటిషు వాణిజ్య సంస్థలకు అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు దేశీయంగా వృద్ధినీఉద్యోగాలనూసమృద్ధినీ ప్రోత్సహించడంలో దోహదపడుతుందని ఆయన అన్నారు.
సమావేశం ముగింపు ఘట్టంలో భాగంగా, వాణిజ్య సంబంధ సమగ్ర సదస్సును నిర్వహించారుదీనిలో ఉభయ పక్షాలకు చెందిన పరిశ్రమ రంగ సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారుఆధునికసమ్మిళితపరస్పర ప్రయోజనకర వాణిజ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడంతో పాటు వృద్ధికీపెట్టుబడికీనవకల్పనకూ సరికొత్త అవకాశాల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పాన్ని ఇరు పక్షాలూ పునరుద్ఘాటించాయి.

 

***


(रिलीज़ आईडी: 2176727) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Malayalam