ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
నైతికత, వారసత్వం, ఆధునిక ఏఐ విజన్… ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లోగో
నైతిక పాలన, న్యాయం, రాజ్యాంగ విలువలు, బాధ్యతాయుతమైన ఏఐ ఆవిష్కరణలో భారత నాయకత్వం
వీటన్నింటి ప్రతీకగా అశోకచక్రం
Posted On:
07 OCT 2025 6:44PM by PIB Hyderabad
ఫిబ్రవరి 19 నుంచి 20వ తేదీ వరకూ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగబోయే ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026 లోగోను భారత ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించింది.
మే 28 నుంచి జూన్ 12, 2025 వరకు మైగవ్ వేదిక ద్వారా నిర్వహించిన లోగో డిజైన్ పోటీ ద్వారా ఈ సమ్మిట్ కు లోగోను ఎంపిక చేశారు. తుది ఎంట్రీలను ఎమర్జింగ్ టెక్నాలజీస్ బృందం, ఎంఈఐటీవై పరిశీలించి.. విజేతను ఎంపిక చేసింది. మై గవ్ కు మొత్తం 599 ఎంట్రీలు రాగా, శ్రీ అజిత్ పి.సురేశ్ రూపొందించిన లోగో పోటీలో ఎంపికైంది.
మానవాళి శ్రేయస్సుకు బాధ్యతయుతమైన ఏఐ ఆవిష్కరణలో ప్రపంచానికి నాయకత్వం వహించాలనే భారత్ ఆశయాన్ని ఎంపికైన లోగో డిజైన్ ప్రతిబింబిస్తుంది. దాని మధ్యలో ఉన్న అశోక చక్రం.. నైతిక పాలన, న్యాయం, భారత డిజిటల్ ప్రయాణానికి ఆధారమైన రాజ్యాంగ విలువలను సూచిస్తుంది.
"లోగో మొదటి డిజైన్ ను 23 గంటల్లో రూపొందించాను. తర్వాత ఏఐ ప్రాధాన్యతను తెలియజేసేలా దాన్ని మెరుగుపరిచాను. అందులోని ప్రకాశవంతమైన కాంతిరేఖలు ప్రపంచానికి భారత దార్శనికత విస్తృతం కావటాన్ని సూచిస్తాయి" అని ఆయన అన్నారు.
బయటకు ప్రసరిస్తున్నట్లుగా ఉన్న న్యూరల్ నెట్‌వర్క్ ఫ్లేర్స్, ఏఐ పరివర్తన శక్తిని, సమగ్ర అభివృద్ధికి భాషలు, రంగాలు, పరిశ్రమలు, భౌగోళిక విభాగాలను సూచిస్తాయి.
లోగో అంతటా ఉన్న రంగుల కలయిక... ఆవిష్కరణ, సమ్మిళిత్వాన్ని సూచిస్తుంది. ఇది ఏఐ విప్లవంలో భాగమైన దేశంలోని విభిన్న పరిశ్రమలు, సంస్కృతులు, సమాజాలను తెలియజేస్తుంది. ఇందులోని రంగులు.. అశోక చక్రం విలువలను ప్రతిఫలిస్తున్నాయి.
ఈ చిహ్నాల రూపకల్పనకి తోడుగా స్పష్టంగా, ఆధునికతతో తీర్చిదిద్దిన అక్షరాలు స్పష్టతను, విశ్వాసాన్ని ఇస్తాయి. దీని ద్వారా డిజిటల్, ప్రింట్ ప్లాట్‌ఫామ్‌లలో ఇది సులభంగా గుర్తుండేలా, అనుకూలంగానూ ఉంటుంది.
ఆధునికతతో కూడిన సంప్రదాయం, నైతిక ఆవిష్కరణ, భారతదేశ జాతీయ గుర్తింపుని ప్రపంచ ఆశయాలతో ఏకం చేస్తూ, ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 స్ఫూర్తిని ఈ లోగో తెలుపుతుంది. సమగ్రాభివృద్ధినీ, స్థిరత్వాన్నీ, పురోగతినీ పెంపొందించడంలో ఏఐ కీలక పాత్రను ప్రదర్శించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆతిథ్యమిస్తున్న- ఈ ప్రపంచ వేదిక సిద్ధమైంది. మానవాళికి ఏఐ చేసే సేవ, సమగ్రాభివృద్ధి, సామాజిక వృద్ధి, పర్యావరణాన్ని పరిరక్షించే ఆవిష్కరణలను ప్రోత్సహించే మార్గాన్ని ఈ సమ్మిట్ నిర్దేశిస్తుంది.
***
(Release ID: 2176303)
Visitor Counter : 7