ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో ప్రాణనష్టం.. విచారం వ్యక్తం చేసిన ప్రధాని పీఎంఎన్ఆర్‌ఎఫ్ నుంచి పరిహరాన్ని ప్రకటించిన మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2025 9:14PM by PIB Hyderabad

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పోస్ట్ చేసింది:

“హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. 

మరణించిన ప్రతి ఒక్కరికి పీఎంఎన్ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారం ఇస్తాం.  గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తాం.”


(రిలీజ్ ఐడి: 2176082) సందర్శకుల సూచీ సంఖ్య : : 45