గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025లో పాల్గొననున్న గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ

Posted On: 06 OCT 2025 2:26PM by PIB Hyderabad

ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ఈ నెల నుంచి వరకు గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్)-2025ను నిర్వహిస్తారుదీనిలో గణాంకాలుకార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌పీఐపాల్గొంటుందిఅధికారిక గణాంకాల ముఖచిత్రంలో మార్పులతో పాటు సమాచార పరంగా చోటుచేసుకుంటున్న లోపాలను సరిదిద్దడంలో ఫిన్‌టెక్ (ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంపోషించదగిన పాత్రను ఒక ప్రత్యేక స్టాల్‌కొన్ని కార్యక్రమాల సాయంతో వివరించనున్నారు.  


జీడీపీసీపీఐలేబర్ మార్కెటులో ముఖ్య గణాంకాల వంటి ప్రధాన గణాంక సూచికలతో ఒక స్టాల్‌ను ఎంఓఎస్‌పీఐ ఏర్పాటు చేస్తుందిఅధికారిక గణాంకాల్లో పారదర్శకత్వానికీవాటి లభ్యతకూనవకల్పనకూ మంత్రిత్వ శాఖ ఎంత చిత్తశుద్ధితో నిబద్ధమై ఉందీ ఈ స్టాల్ చాటిచెబుతుందిఇన్ఫో‌గ్రాఫిక్‌లువీడియోలుసందర్శకులు స్వయంగా భాగస్వాములయ్యేందుకు వీలుండే ప్రదర్శన (డిస్‌ప్లే)ల ద్వారా మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను సందర్శకులు సులభంగా అర్ధం చేసుకోగలిగే ఏర్పాట్లు జీఎఫ్ఎఫ్‌లో ఉంటాయిఈ  కార్యక్రమం ఆశించిన ఫలితాలను అందిస్తుందని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.  


ఆర్థిక సేవల అందజేతలో సాంకేతికతను ఉపయోగించుకోవడం ప్రధానంగా సమాచారంపైన ఆధారపడుతుందిపరిశ్రమలో రహస్య సమాచారానికీఅధికారిక గణాంకాలకూ మధ్య సమన్వయాన్ని ఏర్పరచాలని ఎంఓఎస్‌పీఐ లక్షిస్తోందిఈ నెల 7న ‘‘ఇన్‌సైట్ ఫ్యూజన్బిల్డింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫిన్‌టెక్ విత్ సర్వే అండ్ ఇండస్ట్రీ డేటా’’ అంశంపై బృంద చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తారుఈ చర్చా కార్యక్రమానికి మంత్రిత్వ శాఖతో  పాటు పరిశ్రమ ప్రముఖులు సమన్వయకర్తలుగా ఉంటారువినియోగదారుల ప్రవర్తనవాణిజ్య వ్యవస్థ అవసరాలుఆర్థిక సేవలను ఇప్పటికీ అందరి అందుబాటులోకీ తీసుకు పోలేని స్థితికి సంబంధించిన లోతైన అవగాహననిచ్చే మార్కెట్ డేటా.. జాతీయ గణాంక వ్యవస్థల నిర్వహణలో పెద్ద ఎత్తున చేపడుతున్న సర్వేలకు ఎలా పూరకంగా పనిచేయగలదో ఈ చర్చా కార్యక్రమం వెలుగులోకి తీసుకు వస్తుందిఫలితాల ఆధారిత వృద్ధికి ఒక మార్గసూచీని రూపొందించడానికీసమాజంలో అందరికీ అందుబాటులో ఉండే సేవలనూమరింత ప్రభావవంతమైన నమూనాలనూ రూపొందించడానికీ చొరవ తీసుకోవాల్సిందిగా ఫిన్‌టెక్‌లతో పాటు విధాన రూపకర్తలనూపరిశోధకులనూ ఆహ్వానించడం ఈ  కార్యక్రమం ఉద్దేశం.    


ఈ నెల 8న‘‘డేటా యాజ్ పబ్లిక్ గుడ్హార్నెసింగ్ అఫీషియల్ డేటా ఫర్ ఇన్నొవేష్ అండ్ గ్రోత్’’ అంశంపై ఫైర్‌సైడ్ చాట్ కార్యక్రమం ఉంటుందిదీనిలో ఎంఓఎస్‌పీఐ కార్యదర్శి పాల్గొంటారుసమాచారాన్ని సార్వజనిక వస్తువుగా పరిగణించినప్పుడుఆ సమాచారం సరికొత్త ఆర్థిక సత్తాను ఆవిష్కరించేఅభివృద్ధి ఫలాలను అందరి చెంతకు చేర్చే సామర్థ్యాన్ని సంతరించుకొంటుందిఈ  కార్యక్రమంలో భాగంగా వక్తలు వ్యక్తం చేసే అభిప్రాయాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఆసక్తిదారులకు సరి అయిన సమయంలోపారదర్శకమైన రీతిలోప్రయోజనకరమైన ఆలోచనలను అమలు చేయడంలో సహకార ప్రధాన డేటా ఫ్రేంవర్కుల పాత్ర కీలకమని చాటనున్నాయి.

ఎంఓఎస్‌పీఐ కార్యదర్శి అధ్యక్షతన మరో ఆంతరంగిక సదస్సును కూడా ఈ  నెల 8వ తేదీన నిర్వహిస్తారుఈ సదస్సులో ఫిన్‌టెక్ పరిశ్రమ ప్రతినిధులునియంత్రణ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారుఈ సదస్సు ఇతివృత్తం ‘స్టాటిస్టికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎ డిఇటల్ ఇండియాబిల్డింగ్ ఎ స్మార్టర్ డేటా పార్ట్‌నర్‌షిప్ విత్ ద ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్డిజిటల్ ఆర్థికవ్యవస్థలో నవకల్పనకూఅధునాతన విధాన రూపకల్పనకూ బలమైన గణాంక మౌలిక వ్యవస్థ ఎంతైనా అవసరంరియల్-టైం ప్రాతిపదికన సమాచార సేకరణలో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లునమ్మదగిన సమాచార భాగస్వామ్యాలను కలిసికట్టుగా ఏర్పరుచుకొనేందుకు ఉన్న అవకాశాలతో పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మ్యాపింగునూనిర్ణయాలు చేసే వ్యవస్థలనూ బలోపేతం చేయడంలో ఫిన్‌టెక్‌ల పాత్ర ఈ సదస్సులో భాగంగా  చేసే చర్చల్లో ప్రస్తావనకు వస్తాయి.      


ఈ కార్యక్రమాలతో ఎంఓఎస్‌పీఐ తన కీలక డిజిటల్ ఉత్పాదనలనూఉన్నత నాణ్యత కలిగినరియల్-టైం అధికారిక గణాంకాలనూ సమీకరించుకోవడానికి అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలనూ సమకూర్చుకోవడానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రముఖంగా ప్రదర్శించనుందిఈ ప్రక్రియలో పాలుపంచకోవాల్సిందిగా ఫిన్‌టెక్‌లను ఎంఓఎస్‌పీఐ ఆహ్వానిస్తోంది.

 

***


(Release ID: 2175349) Visitor Counter : 8