రక్షణ మంత్రిత్వ శాఖ
భారత రక్షణ తయారీ రంగంలో అవకాశాలపై న్యూఢిల్లీలో జాతీయ సదస్సును ప్రారంభించనున్న రక్షణ మంత్రి
Posted On:
06 OCT 2025 12:01PM by PIB Hyderabad
'దేశంలో రక్షణ తయారీ రంగంలో అవకాశాలు' అనే అంశంపై అక్టోబర్ 7, 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జాతీయ సదస్సును రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖలోని రక్షణ ఉత్పత్తి విభాగం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. రక్షణ తయారీ రంగంలో స్వావలంబనను సాధించాలనే లక్ష్యంతో ప్రాంతీయ పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమన్వయం చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ.. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయటానికి ఈ కార్యక్రమం ఒక వేదిక కానుంది.
ఈ కార్యక్రమంలో ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన అధికారాలను జారీ చేసేందుకు రూపొందించిన నూతన 'డిఫెన్స్ ఎగ్జిమ్ పోర్టల్'ను, భారత రక్షణ పరిశ్రమల సామర్థ్యాలు, ఉత్పత్తులను మ్యాపింగ్ చేసే డిజిటల్ రిపోజిటరీ శ్రీజన్ డీఈఈపీ (డిఫెన్స్ ఎస్టాబ్లిష్ మెంట్స్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్లాట్ ఫామ్) పోర్టల్ ను రక్షణమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 'ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టార్ పాలసీ కాంపెండియం ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, ఐడీఈఎక్స్ కాఫీ టేబుల్ బుక్ 'షేర్డ్ హారిజన్స్ ఆఫ్ ఇన్నోవేషన్' శీర్షికలతో ఉన్న రెండు పుస్తకాలను కూడా విడుదల చేస్తారు.
(Release ID: 2175320)
Visitor Counter : 4