ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉన్నత ప్రమాణాలతో డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా...


ఎన్‌ఐఈఎల్‌ఐటీ డిజిటల్ యూనివర్శిటీని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్

ముజఫర్‌పూర్ (బిహార్), బాలాసోర్ (ఒడిశా), తిరుపతి (ఆంధ్రప్రదేశ్), లుంగ్లై (మిజోరాం) కేంద్రపాలిత ప్రాంతం దామన్‌లో అయిదు కొత్త ఎన్‌ఐఈఎల్‌ఐటీ కేంద్రాలను వర్చువల్‌గా ప్రారంభించనున్న కేంద్రమంత్రి

కృత్రిమ మేధో, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, సెమీకండక్టర్లు, అనుబంధ రంగాల్లో ప్రత్యేక సాంకేతికతతో యువతకు విద్యా కార్యక్రమాల్ని అందించనున్న ఎన్‌ఐఈఎల్‌ఐటీ డిజిటల్ విశ్వవిద్యాలయం

డిజిటల్ ప్రపంచంలో నైపుణ్య విద్యలోని అంతరాన్ని తగ్గించేందుకు ప్రముఖ పరిశ్రమ భాగస్వాములు విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు

Posted On: 01 OCT 2025 2:35PM by PIB Hyderabad

ఎన్‌ఐఈఎల్‌ఐటీ డిజిటల్ యూనివర్సిటీని కేంద్ర రైల్వేఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతికసమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారుఇది  అందరికీ ఉత్తమమైన డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో రూపొందిన వేదిక.

ఈ వేదిక ద్వారా ఏఐసైబర్ సెక్యూరిటీడేటా సైన్స్సెమీకండక్టర్లుఅనుబంధ రంగాల్లో పరిశ్రమకు అనుకూలమైన పాఠ్యాంశాలను అందిస్తుందిసౌకర్యవంతమైన డిజిటల్ లెర్నింగ్ మోడ్‌లువర్చువల్ ల్యాబ్‌లతో యువతను భవిష్యత్‌కు తగిన నైపుణ్యాలు అందించడమే దీని లక్ష్యం.

బీహార్‌లోని ముజఫర్‌పూర్ఒడిశాలోని బాలాసోర్‌ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్‌ హవేలీదామన్‌ దయ్యూలోని దామన్‌మిజోరంలోని లుంగ్లైలలో నూతనంగా ఏర్పాటు చేసిన అయిదు ఎన్‌ఐఈఎల్‌ఐటీ కేంద్రాలను కేంద్రమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారుఈ కేంద్రాల విస్తరణతో రతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎన్‌ఐఈఎల్‌ఐటీ కీలక పాత్ర పోషించనుంది.

ఈ కార్యక్రమంలో “విద్య డిజిటలైజేషన్‌లో కృత్రిమ మేధో పాత్ర” అనే అంశంపై పరిశోధకులువిద్యావేత్తలతో ప్యానెల్ చర్చ కూడా నిర్వహించనున్నారుఎన్‌ఐఈఎల్‌ఐటీకిండ్రిల్ సంయుక్తంగా నిర్వహించిన అభివృద్ధిభద్రతకార్యకలాపాల కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం కూడా ఈ వేడుకలో జరగనుందిదేశ యువతకు నైపుణ్యాల ఆధారిత డిజిటల్ విద్యను అందించడంలో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనుంది.

పరిశ్రమ-విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు ప్రముఖ పరిశ్రమ భాగస్వాములతో అవగాహన ఒప్పందాలు ఈ కార్యక్రమంలో కుదుర్చుకోనున్నారు.

ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఈఎల్‌ఐటీ విద్యార్థులుప్రముఖ విద్యావేత్తలుసాంకేతిక నిపుణులు సహా 1,500 కంటే ఎక్కువ మంది హాజరవ్వనున్నారుఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్‌సమాచార సాంకేతిక విభాగాల్లో ఎన్‌ఐఈఎల్‌ఐటీ నైపుణ్యాభివృద్ధిఅభ్యాస నమూనాల్లో ప్రావీణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

ఎన్‌ఐఈఎల్‌ఐటీ గురించి

కేంద్ర ఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ).. నైపుణ్యాభివృద్ధిడిజిటల్ సాధికారత రంగాల్లో మార్గదర్శక సంస్థగా నిలిచింది.

దేశవ్యాప్తంగా 56 ఎన్‌ఐఈఎల్‌ఐటీ కేంద్రాలు, 750కి పైగా గుర్తింపు పొందిన సంస్థలు, 9,000కి పైగా ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా ఎన్‌ఐఈఎల్‌ఐటీఈఐసీటీ రంగంలోని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో లక్షలాదిమంది విద్యార్థుల శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రం అందజేయనుంది.

పంజాబ్‌లోని రోపర్‌ ప్రధాన క్యాంపస్‌గాఐజ్వాల్అగర్తలాఔరంగాబాద్కాలికట్గోరఖ్‌పూర్ఇంఫాల్ఇటానగర్అజ్మీర్ (కేక్రి), కోహిమాపాట్నాశ్రీనగర్‌లలో ఉన్న పదకొండు అనుబంధ క్యాంపస్‌లతో  విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్‌ఐఈఎల్‌ఐటీఈకి ప్రత్యేక వర్గం కింద ‘‘డీమ్‌డ్‌ టు బీ యూనివర్సిటీ’’ హోదాను అందించిందిడిజిటల్ సాంకేతికత ద్వారా ఈ అండ్‌ ఐసీటీ రంగంలో ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

***


(Release ID: 2173940) Visitor Counter : 5
Read this release in: Malayalam , English , Urdu , Hindi