ఉప రాష్ట్రపతి సచివాలయం
ఉపరాష్ట్రపతికి కీలక కార్యక్రమాలను వివరించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమం, రసాయనాలు- ఎరువుల మంత్రిత్వ శాఖలు
प्रविष्टि तिथि:
30 SEP 2025 5:40PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమం, రసాయనాలు- ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా.. కేంద్ర సహాయ మంత్రులు శ్రీమతి అనుప్రియ పటేల్, శ్రీ ప్రతాప్రవ్ జాదవ్.. ఆరోగ్య- కుటుంబ సంక్షేమం, రసాయనాలు- ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో కలిసి ఈ రోజు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయంలో ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ను కలిశారు.
ఉపరాష్ట్రపతికి రెండు మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యక్రమాలు, విజయాలు, పనితీరు గురించి వివరించారు. జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వటమే లక్ష్యంగా రెండు మంత్రిత్వ శాఖల కీలక కార్యక్రమాలు, కొనసాగుతున్న పనులపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది.
(रिलीज़ आईडी: 2173382)
आगंतुक पटल : 17