ప్రధాన మంత్రి కార్యాలయం
పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
Posted On:
25 SEP 2025 8:30AM by PIB Hyderabad
పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు. భారత్ సైద్ధాంతిక, ప్రగతి ప్రధాన ప్రస్థానానికి పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అందించిన అపార సేవలను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు.
పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదాన్ని సమర్ధించడంతో పాటు, సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి కూడా ప్రగతి ఫలాలను అందించాలని ఆయన కలలు కన్న ‘అంత్యోదయ’ మార్గం... భారతదేశం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాకు ఎప్పటికీ ప్రేరణనిస్తాయని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సిద్ధాంతాలు సమ్మిళిత్వ వృద్ధి, జాతి నిర్మాణం దిశగా ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘భరత మాత కన్న మహనీయ ముద్దుబిడ్డ, ఏకాత్మ మానవతావాదాన్ని ప్రబోధించిన పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారికి ఆయన జయంతి సందర్భంగా కోటి కోటి వందనాలు. దేశానికి సమృద్ధి మార్గాన్ని చూపించిన ఆయన జాతీయవాద భావనలు, అంత్యోదయ సిద్ధాంతం.. ఇవి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎంతో ఉపయోగకరం.’’
***
(Release ID: 2171106)
Visitor Counter : 13
Read this release in:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam