ID: 2168476 / RK / EC
ఎన్నికల సంఘం
కొనసాగుతోన్న ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన
మరో 474 గుర్తింపు పొందని నమోదిత పార్టీలను తొలగించిన ఈసీఐ
మరో 359 గుర్తింపు పొందని నమోదిత పార్టీల తొలగింపు ప్రక్రియ ప్రారంభం
Posted On: 19 SEP 2025 3:46PM by PIB Delhi
1. ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం దేశంలోని రాజకీయ పార్టీలు (జాతీయ, రాష్ట్ర లేదా నమోదై గుర్తింపు పొందని పార్టీలు) భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వద్ద నమోదవుతున్నాయి.
2. చట్టంలోని నిబంధనల ప్రకారం నమోదైన రాజకీయ పార్టీకి గుర్తు, పన్ను మినహాయింపుల వంటి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి.
3. రాజకీయ పార్టీలకు సంబంధించిన నమోదు మార్గదర్శకాల ప్రకారం ఏదైనా పార్టీ వరుసగా 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆ పార్టీని నమోదైన పార్టీల నుంచి తొలగించాలి.
4. ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఈసీఐ ఎప్పటికప్పుడు సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 2019 నుంచి అంటే వరుసగా ఆరు సంవత్సరాల పాటు ఏ ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందని నమోదిత రాజకీయ పార్టీలను (ఆర్‌యూపీపీ) తొలగించేందుకు ఈసీఐ కసరత్తు చేస్తోంది.
5. ఈ కసరత్తు మొదటి దశ కింద 2025 ఆగస్టు 9న ఈసీఐ.. 334 ఆర్‌యూపీపీలను జాబితా నుంచి తొలగించింది.
6. దీనికి కొనసాగింపుగా రెండో దశలో ఆరు సంవత్సరాల పాటు వరుసగా ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాలన్న తప్పనిసరి నిబంధనను పాటించని 474 ఆర్‌యూపీపీలను 2025 సెప్టెంబర్ 18న తొలగించింది. ఈ విధంగా గత 2 నెలల్లో 808 ఆర్‌యూపీపీలను తొలగించింది (అనుబంధం-ఏ).
7. ఈ కసరత్తును మరింత తీసుకువెళ్లేందుకు గత మూడు ఆర్థిక సంవత్సరాలలో (2021-22, 2022-23, 2023-24) ఆడిట్ చేసిన వార్షిక ఖాతాలను నిర్ణీత వ్యవధిలోగా సమర్పించని, ఎన్నికల వ్యయ నివేదికను దాఖలు చేయని 23 రాష్ట్రాలు, యూటీలకు చెందిన 359 ఆర్‌యూపీపీలను గుర్తించింది (అనుబంధం-బి).
8. ఏ పార్టీని కూడా అనవసరంగా తొలగించకూడదన్న ఉద్దేశంతో సంబంధిత రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల సీఈఓలు ఆయా ఆర్‌యూపీపీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఈసీఐ ఆదేశించింది. తదనంతరం సంబంధిత సీఈఓల ముందు తమ వాదనను వినిపించే అవకాశం ఆయా పార్టీలు ఉంటుంది.
9. సీఈఓల నివేదికల ఆధారంగా ఆర్‌యూపీపీల తొలగింపుపై ఈసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది.
PK/GDH/RP
Annexure - A
State-wise distribution of RUPPs delisted in second phase
|
SI No.
|
State/UT
|
No. of RUPPs
|
|
1
|
Andaman & Nicobar Island
|
1
|
|
2
|
Andhra Pradesh
|
17
|
|
3
|
Assam
|
3
|
|
4
|
Bihar
|
15
|
|
5
|
Chandigarh
|
1
|
|
6
|
Chhattisgarh
|
7
|
|
7
|
Delhi
|
40
|
|
8
|
Goa
|
4
|
|
9
|
Gujarat
|
10
|
|
10
|
Haryana
|
17
|
|
11
|
Himachal Pradesh
|
2
|
|
12
|
Jammu & Kashmir
|
12
|
|
13
|
Jharkhand
|
7
|
|
14
|
Karnataka
|
10
|
|
15
|
Kerala
|
11
|
|
16
|
Madhya Pradesh
|
23
|
|
17
|
Maharashtra
|
44
|
|
18
|
Manipur
|
2
|
|
19
|
Meghalaya
|
3
|
|
20
|
Mizoram
|
2
|
|
21
|
Nagaland
|
2
|
|
22
|
Odisha
|
7
|
|
23
|
Punjab
|
21
|
|
24
|
Rajasthan
|
17
|
|
25
|
Tamil Nadu
|
42
|
|
26
|
Telangana
|
9
|
|
27
|
Tripura
|
1
|
|
28
|
Uttar Pradesh
|
121
|
|
29
|
Uttarakhand
|
11
|
|
30
|
West Bengal
|
12
|
|
|
Total
|
474
|
Annexure - B
State-wise distribution of RUPPs identified for third phase of delisting
|
SI No.
|
State/UT
|
No. of RUPPs
|
|
1
|
Andhra Pradesh
|
8
|
|
2
|
Assam
|
2
|
|
3
|
Bihar
|
30
|
|
4
|
Chandigarh
|
1
|
|
5
|
Chhattisgarh
|
9
|
|
6
|
Delhi
|
41
|
|
7
|
Gujarat
|
9
|
|
8
|
Haryana
|
11
|
|
9
|
Himachal Pradesh
|
1
|
|
10
|
Jharkhand
|
7
|
|
11
|
Karnataka
|
13
|
|
12
|
Kerala
|
6
|
|
13
|
Madhya Pradesh
|
6
|
|
14
|
Maharashtra
|
1
|
|
15
|
Odisha
|
6
|
|
16
|
Punjab
|
11
|
|
17
|
Rajasthan
|
7
|
|
18
|
Sikkim
|
1
|
|
19
|
Tamil Nadu
|
39
|
|
20
|
Telangana
|
10
|
|
21
|
Uttar Pradesh
|
127
|
|
22
|
Uttarakhand
|
2
|
|
23
|
West Bengal
|
11
|
|
|
Total
|
359
|
***