శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

6,000కు పైగా నక్షత్ర సమూహాల సమాచారంతో పాలపుంత ధూళి కణాల తెరను మ్యాప్ చేసిన శాస్త్రవేత్తలు

Posted On: 16 SEP 2025 5:40PM by PIB Hyderabad

మన పాలపుంతను కప్పి ఉంచుతూ కంటికి కనిపించని ధూళి తెరలను ఖగోళ శాస్త్రవేత్తలు మ్యాప్ చేశారునక్షత్ర కాంతిని ఎర్రగా చూపించే ఈ అంతరిక్ష ధూళి తెరను మ్యాప్ చేయడం వల్ల భవిష్యత్తులో కొత్త నక్షత్రాల పుట్టుకను తెలుసుకునేందుకు వీలుండొచ్చని భావిస్తున్నారు.

పాలపుంతలో నక్షత్రాల మధ్య పెద్ద మొత్తంలో ఉండే ధూళికణాలువాయువు.. నక్షత్ర కాంతిని అడ్డుకుంటాయి లేదా మసకబారేలా చేస్తాయిదీన్ని 'నక్షత్ర కాంతి అంతర్ధానంఅని అంటారుఈ ధూళికణాల విస్తరణను అర్థం చేసుకోవటం ద్వారా నక్షత్రాల పుట్టుకపాలపుంత నిర్మాణాన్నీ శాస్త్రవేత్తలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద స్వయంప్రతిపత్తితో పనిచేసే ఆర్యభట్ట రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ఏఆర్ఐఈఎస్శాస్త్రవేత్తలు, 6,000కు పైగా నక్షత్ర సమూహాల నుంచి సేకరించిన సమాచారం ద్వారా అంతరిక్ష ధూళికణాల విస్తరణను గుర్తించారుఈ నక్షత్ర సమూహాలు.. పాలపుంతకు దగ్గరలోనే దట్టంగా ఉంటాయిదీనినే డిస్క్ అని పిలుస్తారుఈ ప్రాంతంలోనే కొత్త నక్షత్రాలు పుడుతున్నాయినక్షత్రాల ఆధారంగానే విశ్వంలోని ధూళినీవాయువునీ గుర్తించడం కూడా సులభం అవుతున్నది.

డాక్టర్ వై.సి.జోషి నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో ధూళి కణాల విస్తరణ ఏకరూపకంగా లేదని తేలిందిసన్ననిఅలల వంటి పొరగా ఏర్పడుతున్నాయిఇవి గెలాక్సీ కేంద్రంతో సరిపోలటం లేదుపాలపుంత చుట్టూ చూస్తే ఈ ఎరుపురంగు ప్రాంతం పైకికిందకీ అలల మాదిరిగా కదులుతోందిగెలాక్సీ రేఖాంశం 41° ల వద్ద అత్యధిక ధూళికణాలు ఉండగాఅతి తక్కువగా 221° ల వద్ద ఉన్నాయి. సూర్యుడు ఈ ధూళికణాల పొరపైన సుమారు 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు.

గెలాక్సీ కేంద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ధూళికణాల పొర మందంగామరికొన్ని చోట్ల పలుచగా ఉందిఈ అసమాన విస్తరణ మన గెలాక్సీ నిర్మాణం ఎంత ప్రభావవంతమైనదోసంక్షిష్టమైనదో సూచిస్తుందిగెలాక్సీ లోని ధూళికణాల నిర్మాణం గురించి ఖగోళ శాస్త్రవేత్తలకు ఈ పరిశోధన స్పష్టతనిచ్చిందిఇది నక్షత్రాలుగెలాక్సీల అధ్యయనానికి ఎంతో అవసరంకొత్త నక్షత్రాలు ఏర్పడే ప్రాంతాల్లో ఎక్కువ ధూళికణాలు ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

భవిష్యత్తు పరిశీలనల ఆవశ్యకతను ఈ అధ్యయనం స్పష్టం చేసిందిముఖ్యంగా పాలపుంత నక్షత్ర మండలంలోని ధూళికణాల నిర్మాణాల త్రీడీ చిత్రాన్ని రూపొందించేందుకు దూర ప్రాంతాలపై పరిశోధనలు అవసరమని తేలిందిగాయ్యా అందించే తదుపరి డేటావెరా సి.రూబిన్ అబ్జర్వేటరీ లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ (ఎల్ఎస్ఎస్ టీవంటి భవిష్యత్ మిషన్లు అందించే సమాచారం మరింత ముఖ్యం కానున్నది.

 

***


(Release ID: 2167789) Visitor Counter : 3
Read this release in: English , Urdu , Hindi