పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 342 కోట్లకు పైగా 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల
Posted On:
17 SEP 2025 11:14AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరం కోసం గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. తొలి విడతగా 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం తమిళనాడుకు రూ.127.586 కోట్ల విలువైన అన్‌టైడ్ గ్రాంట్లను (అర్హత గల 2901 గ్రామ పంచాయతీలు, 74 మండల పంచాయతీలు, 9 జిల్లా పంచాయతీలు) విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం అస్సాం రాష్ట్రానికి రూ.214.542 కోట్లు (అర్హత గల 2192 గ్రామ పంచాయతీలు, 156 మండల పంచాయతీలు, 27 జిల్లా పరిషత్లు) పంపిణీ చేశారు.
పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, జల్ శక్తి మంత్రిత్వ శాఖ (తాగునీరు-పారిశుద్ధ్య విభాగం) ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలు (ఆర్ఎల్‌బీలు), పంచాయతీ రాజ్ సంస్థల (పీఆర్ఐల) కోసం రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేయాలని భారత ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. కేటాయించిన నిధుల కోసం సిఫార్సులు చేసి, ఆర్థిక సంవత్సరంలో 2 విడతలుగా విడుదల చేస్తారు. రాజ్యాంగంలోని పదకొండో షెడ్యూల్‌లో పొందుపరచిన ఇరవై తొమ్మిది (29) అంశాల కింద జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు మినహా ప్రాంత-నిర్దిష్ట అవసరాల కోసం ఆర్ఎల్‌బీలు, పీఆర్ఐలు ఈ అన్‌టైడ్ నిధులను ఉపయోగిస్తాయి. టైడ్ గ్రాంట్లను (ఎ) పారిశుధ్యం, ఓడీఎఫ్ స్థితి నిర్వహణ వంటి ప్రాథమిక సేవలకు ఉపయోగించవచ్చు. ఇందులో ముఖ్యంగా మానవ విసర్జితాల నిర్వహణ, గృహ వ్యర్థాల నిర్వహణ, శుద్ధి కోసం నిధులను ఉపయోగించవచ్చు (బి) తాగునీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ, నీటి రీసైక్లింగ్ వంటి పనుల కోసం ఉపయోగించవచ్చు.
***
(Release ID: 2167776)
Visitor Counter : 2